చిరంజీవి వర్సెస్ మోహన్ లాల్!
on Mar 1, 2021
ఒకరేమో టాలీవుడ్ మెగాస్టార్.. మరొకరేమో మాలీవుడ్ సూపర్ స్టార్.. ఇద్దరు కూడా వేసవిలో ఒకే డేట్ ని టార్గెట్ చేసుకున్నారు. ఆ ఇద్దరు స్టార్స్ మరెవరో కాదు.. చిరంజీవి, మోహన్ లాల్.
ఆ వివరాల్లోకి వెళితే.. మెగాస్టార్ చిరంజీవి టైటిల్ రోల్ లో నటిస్తున్న సోషల్ డ్రామా `ఆచార్య`. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ రూపొందిస్తున్నారు. మే 13న ఈ భారీ బడ్జెట్ మూవీ థియేటర్స్ లో సందడి చేయనుంది.
కట్ చేస్తే.. అదే రోజు మాలీవుడ్ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన `మరక్కర్ అరబిక్ కడలింటే సింహం` అనే ఎపిక్ ఇండియన్ హిస్టరీ మూవీ రిలీజ్ కానుంది. ప్రధానంగా మలయాళంలో రూపొందిన ఈ భారీ బడ్జెట్ చిత్రం.. తెలుగుతో సహా పలు భారతీయ భాషల్లో పాన్ ఇండియా మూవీగా విడుదల కానుంది. కాగా, తొలుత మార్చి 26న విడుదల చేయాలని భావించినా.. కొన్ని కారణాల వల్ల మే 13కి వాయిదా పడిందీ సినిమా.
దీంతో.. చిరంజీవి వర్సెస్ మోహన్ లాల్ అన్నట్లుగా వాతావరణం నెలకొంది. మరి.. ఈ బాక్సాఫీస్ వార్ లో ఎవరు విన్నర్ గా నిలుస్తారో చూడాలి.
Also Read