కిష్కింధపురి పై చిరంజీవి వీడియో రివ్యూ వైరల్
on Sep 16, 2025

మెగాస్టార్ 'చిరంజీవి'(Chiranjeevi)ప్రస్తుతం 'అనిల్ రావిపూడి'(Anil ravipudi)దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana shankara Vara Prasad)అనే చిత్రంతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. 'సంక్రాంతికి వస్తున్నాం' లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత 'అనిల్ రావిపూడి' నుంచి మరోసారి ఫ్యామిలీ ఎంటర్ టైన్ మెంట్ అంశాలతో తెరకెక్కుతున్న మూవీ కావడం, చిరంజీవి మాస్ ఇమేజ్ అందుకు తోడయ్యి, టోటల్ గా మాస్ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైన్ మెంట్ అంశాలతో నెక్స్ట్ సంక్రాంతికి వస్తుంది. చిరంజీవి కూతురు సుస్మిత తో కలిసి షైన్ క్రియేషన్స్ పై గాడ్ ఆఫ్ మాసెస్ 'బాలకృష్ణ' తో 'భగవంత్ కేసరి' ని నిర్మించిన 'సాహు గారపాటి నిర్మిస్తున్నాడు
చిరంజీవి రీసెంట్ గా ఈ నెల 12 న విడుదలైన 'కిష్కిందపురి'(Kishkindhapuri)మూవీ గురించి ఒక వీడియో రిలీజ్ చేసాడు. అందులో ఆయన మాట్లాడుతు కిష్కింధపురి నన్ను ఎంతగానో అలరించింది. హర్రర్ సినిమాగానే కాకుండా సైకలాజికల్ గా దర్శకుడు కౌశిక్ పగళ్ళపాటి చెప్పిన పాయింట్ చాలా బాగుంది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్(Bellamkonda sai Srinivas) అనుపమ మంచి నటన కనబరిచారు. చైతన్ భరద్వాజ్ సంగీతం కూడా మెప్పించింది. 'మన శంకర వరప్రసాద్ గారుని నిర్మిస్తున్న 'సాహు గారపాటి'(Sahu Gaarapati)మంచి ప్రయత్నం అందించారు. తప్పకుండా ప్రతీ ఒక్కరూ థియేటర్స్ లో చూడండి అంటూ మెగాస్టార్ సూచించారు. మెగాస్టార్ వీడియో రివ్యూ ఇప్పుడు వైరల్ గా మారింది.
హర్రర్ మిస్టరీ థిల్లర్ గా, సరికొత్త కథాంశాలతో తెరకెక్కిన 'కిష్కింధపురి' రోజు రోజుకి ప్రేక్షకుల సంఖ్యని పెంచుకుంటు బాక్స్ ఆఫీస్ వద్ద తన చాటుతుంది. ఇందుకు ఆ చిత్రం సాధిస్తున్న కల్లెక్షన్స్ నే ఉదాహరణ. సాండీ, తనికెళ్ళ భరణి, శ్రీకాంత్ అయ్యంగార్, మకరంద్ దేశ్ పాండే తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



