'రానా' సర్ ప్రైజ్ ఎంట్రీ.. '1945' రిలీజ్ డేట్ వచ్చేసింది!
on Dec 9, 2021
కెరీర్ ప్రారంభం నుంచి విభిన్న చిత్రాలు, పాత్రలతో అలరిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రానా దగ్గుబాటి త్వరలో మరో విభిన్న చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. రానా ప్రధానపాత్రలో నటించిన పీరియడ్ డ్రామా '1945'. తాజాగా ఈ మూవీ విడుడల తేదీని మేకర్స్ ప్రకటించారు.
సీకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సి.కళ్యాణ్ నిర్మించిన ఈ సినిమాకి సత్యశివ దర్శకత్వం వహించాడు. ఈ మూవీని డిసెంబర్ 31 విడుదల చేస్తున్నట్లు ప్రకటిస్తూ మేకర్స్ తాజాగా ఓ పోస్టర్ ను విడుదల చేశారు. ఆ పోస్టర్ లో కాలిపోతున్న బ్రిటిష్ జెండాని పట్టుకొని రానా కనిపిస్తున్నాడు. బ్రిటిష్ వారిపై ఓ సైనికుడు చేసే భీకర పోరాటమే ఈ సినిమా అని మేకర్స్ తెలిపారు. నిజానికి ఈ సినిమా ఎప్పుడో షూటింగ్ పూర్తయింది. నాలుగైదేళ్ల క్రితం ప్రకటించిన ఈ సినిమా పలు కారణాలు, వివాదాలతో వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు ఇంతకాలానికి ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇదిలాఉంటే ఇండియాస్ బిగ్గెస్ట్ యాక్షన్ డ్రామా 'ఆర్ఆర్ఆర్' జనవరి 7 న ప్రేక్షకుల ముందుకు రానుంది. దానికి వారంరోజుల ముందు రానా సర్ ప్రైజ్ ఎంట్రీ ఇస్తుండటం విశేషం.
ఈ సినిమాలో రెజీనా హీరోయిన్ గా నటించింది. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాకి యువన్ శంకర్ రాజా సంగీతం అందించాడు. ఈ మూవీ తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల కానుంది.
Also Read