చైనా మార్కెట్ పై కన్నేసిన చిరంజీవి
on Mar 9, 2018
.jpg)
ప్రస్తుతం ఇండియన్ సినిమాలకి చైనా లో మంచి డిమాండ్ ఉంది. అమీర్ ఖాన్ నటించిన దంగల్ తో మొదలయిన ఇండియన్ సినిమాల డామినేషన్, ఇంకా కొనసాగుతూనే ఉంది. బాహుబలి 2 , సీక్రెట్ సూపర్ స్టార్, బజ్రంగి భాయిజాన్ లాంటి సినిమాలు చైనా లో వందల కోట్లు కొల్లగొట్టాయి. మిగతా హీరోలు కూడా చైనా మార్కెట్ పై కన్నేశారు. మెగాస్టార్ చిరంజీవి కూడా తన మార్కెట్ ని చైనా కి విస్తరించే ఆలోచనలో ఉన్నాడని సమాచారం. తన కొత్త చిత్రం సైరా నరసింహా రెడ్డి ని చైనా లో రిలీజ్ చేసేలా చూడాలని దర్శక, నిర్మాతలకు చెప్పాడట. చైనా లో చారిత్రాత్మక మరియు ఎమోషనల్ డ్రామా సినిమాలకి మంచి డిమాండ్ ఉంది. సో, ఈ రెండు కోణాలు ఉన్న తన సినిమా అక్కడ కలెక్షన్స్ కొల్లగొట్టడం ఖాయం అని భావిస్తున్నాడట. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో, రామ్ చరణ్ నిర్మాణంలో రూపుదిద్దుకుంటున్న సైరా నరసింహా రెడ్డి లో నయనతార ప్రధాన పాత్ర పోషిస్తుంది. త్వరలో మొదలవనున్న రెండో షెడ్యూల్ లో గెస్ట్ రోల్ ప్లే చేస్తున్న అమితాబ్ బచ్చన్ కూడా జాయిన్ అవుతాడని సమాచారం. స్వాతంత్ర్య సమరవీరుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న సైరా ని 2019 సంక్రాంతికి లేదా సమ్మర్ లో విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



