చిరంజీవి మా ''డాడీ''...డీఎన్‌ఏ టెస్టుకు రెడీ!!
on Nov 6, 2015
.jpg)
మెగాస్టార్ చిరంజీవి తనకు తండ్రి అని..కావాలంటే డీఎన్‌ఏ టెస్టులకు రెడీగా వున్నానని సుజిత్ అనే వ్యక్తి హెచ్‌ఆర్సీని ఆశ్రయించి సంచలనానికి తెరతీసాడు. చిరంజీవి అసలు మొదటి కొడుకు తానేనని.. డీఎన్‌ఏ టెస్ట్ లు చేస్తే మొత్తం బయటపడుతుందని అంటున్నాడు. మెగాస్టార్ పసివాడి ప్రాణంలో నటించిన చిన్న బాబుని తానేనని అతను చెప్పడం విశేషం. మరోవైపు ఈ విషయం పై మెగా అభిమానులు మండిపడుతున్నారు. పసివాడి ప్రాణం సినిమా వచ్చిన 28 ఏళ్ళ తరువాత చిరంజీవి మా నాన్న అని చెప్పడం ఏదో కుట్రలాగా వుందని వారు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయిన పసివాడి ప్రాణం సినిమాలో చిన్న పిల్లవాడి పాత్ర చేసింది అబ్బాయి కాదని, అమ్మాయి అని వారు వివరణ కూడా ఇచ్చారు. చిరంజీవి ప్రతిష్ఠను దిగజార్చేందుకే ఇలాంటి తప్పుడు వార్తలను సృష్టిస్తున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పబ్లిసిటీ పిచ్చితో సుజిత్ ఇలా చేస్తున్నాడని లేదా అతడు పిచ్చివాడై వుంటాడని వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ కేసును హెచ్‌ఆర్సీ ఎలా డీల్ చేస్తుందో..!! ఈ వార్త ఈ రోజు ప్రముఖ తెలుగు ఛానెల్ లో ప్రసారమైంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



