అల్లుఅర్జున్ కోసం వచ్చిన చిరంజీవి
on Dec 13, 2024

పుష్ప 2(pushpa 2)బెనిఫిట్ షో సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ చనిపోవడంతో పాటు,ఆమె కుమారుడు శ్రీతేజ్ గాయాలు పాలవడానికి కారణమయ్యాడనే కారణంతో అల్లు అర్జున్ ని అరెస్ట్ చేసిన సంఘటన ఇప్ప్పుడు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది.
ఇక ఊహించని ఈ సంఘటనతో అవాక్కయిన అల్లు అర్జున్ మావయ్య మెగాస్టార్ చిరంజీవి షూటింగ్ క్యాన్సిల్ చేసుకొని తన సతీమణి సురేఖ తో కలిసి అల్లు అరవింద్ నివాసానికి వచ్చారు. అలాగే మరో మావయ్య నాగ బాబు కూడా అల్లు అర్జున్ నివాసానికి రావడం జరిగింది.ఇక గాంధీ హాస్పిటల్ లో అల్లు అర్జున్ కి అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించగా నాంపల్లి కోర్టులో నాలుగుగంటలకు కేసు విచారణ జరగనుంది.తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విషయంపై మాట్లాడుతు చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. కేసు దర్యాప్తులో నా జోక్యం ఏమీ ఉండదు. తొక్కిసలాటలో చనిపోవడం వల్లే పోలీసులు చర్యలు తీసుకుంటున్నారని చెప్పడం జరిగింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



