కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు ఆదరిస్తారని మరోసారి రుజువైంది
on Aug 6, 2022
కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు ఆదరిస్తారని మరోసారి రుజువైందని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. నిన్న(ఆగస్టు 5) విడుదలైన 'సీతారామం', 'బింబిసార' సినిమాలు హిట్ టాక్ తెచ్చుకోవడంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు.
ఒకేరోజు విడుదలైన 'బింబిసార', 'సీతా రామం' సినిమాలు రెండూ పాజిటివ్ టాక్ సొంతం చేసుకోవడంతో పాటు మళ్ళీ ప్రేక్షకులను థియేటర్స్ కి రప్పిస్తున్నాయి. దీంతో సినీ పరిశ్రమ సంతోషం వ్యక్తం చేస్తోంది. ఈ క్రమంలో తాజాగా చిరంజీవి ట్విట్టర్ వేదికగా రెండు మూవీ టీమ్ లకు శుభాకాంక్షలు తెలిపారు.
"ప్రేక్షకులు సినిమా థియేటర్లకి రావడం లేదని బాధపడుతున్న ఇండస్ట్రీకి ఎంతో ఊరటనీ మరింత ఉత్సాహాన్నిస్తూ, కంటెంట్ బావుంటే ప్రేక్షకులెప్పుడూ ఆదరిస్తారని మరోసారి నిరూపిస్తూ నిన్న విడుదలయిన చిత్రాలు రెండూ విజయం సాధించటం ఎంతో సంతోషకరం. ఈ సంధర్భంగా 'సీతారామం', మరియు 'బింబిసార' చిత్రాల నటీనటులకు, నిర్మాతలకు, సాంకేతిక నిపుణులందరికీ నా మనః పూర్వక శుభాకాంక్షలు." అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
