గురువు బాధ్యతని భుజాన వేసుకున్న చిరంజీవి!
on Sep 29, 2023
చిరంజీవి,అమితాబచ్చన్ లు ఇద్దరు కూడా సినీ రంగంలో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన వాళ్ళే .తమ నటనతో కోట్లాదిమంది అభిమానులని సంపాదించుకున్నారు.లేటెస్టుగా చిరంజీవి భోళా శంకర్ మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చి తనలో గ్రేస్ ఏ మాత్రం తగ్గలేదని నిరూపించాడు. అలాగే అమితాబచ్చన్ 80 సంవత్సరాల వయసులో కూడా అప్పుడప్పుడు సినిమాల్లో నటిస్తూ తన అభిమానులతో పాటు సినీ ప్రేక్షకుల్ని అలరిస్తున్నారు.ఇప్పుడు చాలా రోజుల తర్వాత అమితాబ్ గణపథ్ అనే మూవీ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. టైగర్ ష్రాఫ్ అండ్ కృతిసనన్ జంటగా అమితాబ్ ముఖ్య పాత్రలో రూపొందిన గణపథ్ సినిమా దసరా సందర్భంగా అక్టోబర్ 20 వ తేదీన హిందీ తో పాటు తెలుగు తమిళ, కన్నడ మలయాళ భాషల్లో రిలీజ్ కానుంది.
ఇటీవలే ఈ మూవీ కి సంబంధించిన టీజర్ ని మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా మేకర్స్ విడుదల చేసారు. టీజర్ లో టైగర్ ష్రాఫ్ మార్షల్ ఆర్ట్స్ కి సంబంధించిన రకరకాల విన్యాసాలని ప్రదర్శించడం ఆకట్టుకుంది.అలాగే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా అద్భుతంగా ఉండి సినిమా మీద చాల ఆసక్తిని పెంచేలా ఉంది.తన గురువు టీజర్ ని రిలీజ్ చెయ్యడం చాలా ఆనందం గా ఉందని సినిమా ఘన విజయం సాధించాలని చిరంజీవి కోరారు.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
