
‘కార్తికేయ’, ‘కార్తికేయ 2’, ‘తండేల్’ సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు చందూ మొండేటి.. ఇప్పుడు బాలీవుడ్‌లోకి అడుగుపెట్టబోతున్నారట. అది కూడా ఏకంగా రానా దగ్గుబాటి, అక్షయ్ కుమార్ వంటి క్రేజీ కాంబినేషన్‌తో.
చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాకు ‘మహాకాళ్’ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. ఈ ప్రాజెక్ట్‌కు కథను సంజయ్ లీలా భన్సాలీ అందించడంతో పాటు.. నిర్మాణ బాధ్యతలు కూడా ఆయనే చేపట్టనున్నట్లు సమాచారం.
రానా దగ్గుబాటి, అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రల్లో కనిపించనున్న ‘మహాకాళ్’ సినిమా మైథలాజికల్ డ్రామాగా భారీ స్థాయిలో రూపొందనుందని టాక్.

‘కార్తికేయ 2’లో మైథాలజీని తనదైన శైలిలో డీల్ చేసిన చందూ.. ఇప్పుడు బాలీవుడ్‌లో కూడా అదే తరహా బ్యాక్‌డ్రాప్‌తో భారీ ప్రాజెక్ట్ చేయబోతుండటం ఆసక్తిని పెంచుతోంది.
ఈ ప్రాజెక్ట్ వెనుక సంజయ్ లీలా భన్సాలీ ఉండటం మరో ప్రత్యేకతగా చెప్పొచ్చు. ‘కార్తికేయ 2’లో చందూ మొండేటి చేసిన పనితో ఇంప్రెస్ అయిన భన్సాలీ.. ఈ ప్రాజెక్ట్ కోసం ఆయన్ను సంప్రదించినట్లు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: మెగా హీరో ఏమైపోయాడు.. త్వరలోనే అభిమానులకు ఆ న్యూస్ చెబుతాడా.?
[Chandoo Mondeti Bollywood Debut, Chandoo Mondeti Mahakaal Movie, Rana Akshay Kumar Movie, Chandoo Mondeti Hindi Movie, Mahakaal Movie Update, Rana Daggubati, Akshay Kumar, Sanjay Leela Bhansali, Telugu Film News]






