Home

»

Latest News

షాక్ ఇచ్చిన అమీర్ లోగ్ ఓటిటి స్ట్రీమింగ్: ఖచ్చితంగా ఇది ఆ ముగ్గురి పనే! 

Sep 30, 2026 4:20PM


కొన్ని సినిమాలు మనలో ఉన్న డల్ నెస్ ని కిలోమీటర్ల దూరంలో దిష్టి తీసి పారేస్తాయి. అలాంటి ఒక చిత్రమే ‘అమీర్ లోగ్'. హైదరాబాద్ నగరంలోని గల్లీలు, బస్తీల్లో ఉండే  మనుషుల స్వచ్ఛమైన ఆప్యాయతలు, వారి మధ్య ఉండే అనుబంధాల నేపథ్యంలో తెరకెక్కింది.

 ఆగస్టు 21న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం, పెద్దగా ప్రచారం లేకపోవడం వల్ల ఎక్కువ మంది దృష్టిని ఆకర్షించలేకపోయింది. అయితే ఓటిటి ప్రేమికులకి సర్ప్రైజ్ ఇస్తూ ఈ సినిమా ఒకేసారి 3 దిగ్గజ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లైన ఆహా (Aha), అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video), మరియు సన్ నెక్స్ట్ (Sun NXT)లలో స్ట్రీమింగ్‌కి  వచ్చేసింది. అలా వచ్చిందో లేదో, విపరీతమైన ఆదరణ సొంతం చేసుకుంటూ వీకెండ్ వాచ్ లిస్ట్‌లో నిలిచింది.

ఇది కూడా చదవండి: దుర్గమ్మ సన్నిధిలో 'ది ప్యారడైజ్': ఇక రికార్డులే తరువాయి!

 

దర్శకుడు రమణా రెడ్డి సోమ దర్శకత్వంలో రూపుదిద్దుకోగా  స్పిరిట్ మీడియా (Spirit Media) బ్యానర్‌‌పై స్టార్ హీరో రానా దగ్గుబాటి సమర్పకుడిగా వ్యవహరించడం విశేషం. కథ చెప్పాలని ఉంది కానీ, చెప్తే సినిమా ఇచ్చే కిక్ మిస్ అవుతుంది. మస్తు హుషారు మాత్రం గ్యారంటీ. 

  

[Ameer Log Ott Release Three Platforms, Ameer Log OTT release date, Ameer Log streaming on Aha Amazon Prime, Telugu comedy drama movie OTT, Rana Daggubati Spirit Media,Telugu Cinema, Telugu Cinema News, Tollywood, Tolywood News]

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com