Home

»

Latest News

బెజవాడ దుర్గమ్మ సన్నిధిలో 'ది ప్యారడైజ్': ఇక రికార్డులే తరువాయి!

Sep 30, 2026 3:55PM

 

విజయవాడ ప్రజలతో పాటు రెండు తెలుగు రాష్ట్ర ప్రజల ఇలవేల్పు కనకదుర్గమ్మ.   ఇంద్రకీలాద్రి పై వేంచేసి ఉన్నఆ అమ్మ కరుణ ఉంటే భయాలు, దోషాలు హామ్ ఫట్ అని భక్తుల నమ్మకం. ఆ ఉద్దేశ్యంతోనే ఇప్పుడు ది ప్యారడైజ్ నాని దుర్గమ్మ కొండపై ఉన్నాడు. 


ప్యారడైజ్ ఊహలకి భిన్నంగా మంచి కలెక్షన్స్ తో రన్ అవుతున్న సందర్భంగా   అమ్మవారికి కృతజ్ఞతలు తెలిపేందుకు  నాని, హీరోయిన్ కయాదు లోహర్, ఇతర యూనిట్ సభ్యులు కలసి కనకదుర్గమ్మని  దర్శించుకున్నారు. ఈ సందర్భంగా  చిత్రబృందానికి ఆలయ అధికారులు, అర్చకులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన నానికి వేదపండితులు మంత్రోచ్ఛారణల మధ్య వేదాశీర్వచనం అందించి, శేషవస్త్రాలు, తీర్థప్రసాదాలను అందజేశారు. కనకదుర్గమ్మ సన్నిధిలో నాని ఉన్న దృశ్యాలు, వేదపండితులు ఆశీర్వచనం ఇస్తున్న వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో  వైరల్ అవుతున్నాయి.


ఇది కూడా చదవండి: ఈ ముగ్గురు భారతీయులు: నోటీసులపై ఎలా స్పందించారో చూడండి

 

 

నిన్న తెలంగాణ, తెలుగు ప్రజల ఇలవేల్పు మేడారం 'సమ్మక్క సారలమ్మ; ని నాని అండ్ టీం దర్శించుకున్న విషయం తెలిసిందే. ఇక ప్యారడైజ్  200 కోట్ల క్లబ్‌కి  సమీపంలో ఉండటం విశేషం.


    
[Nani Visits Kanakadurga Temple, The Paradise Movie, Nani, Paradise Collections, Kanaka Durga Temple, kayadu Lohar, Telugu Cinema, Telugu Cinema News, Tollywood, Tolywood News]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com