విజయ్ సింగరేణి ప్రేయసి!
on Dec 14, 2019

విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ ఫిల్మ్ 'వరల్డ్ ఫేమస్ లవర్'. క్రాంతిమాధవ్ దర్శకుడు. ఈ చిత్రంలో నాలుగు దశల్లో నలుగురు అమ్మాయిలు విజయ్ జీవితంలో ప్రవేశిస్తారు. వీరిలో విజయ్ భార్యగా, తెలంగాణ అమ్మాయి సువర్ణగా ఐశ్వర్యా రాజేష్, ఫ్రెంచ్ గర్ల్‌ఫ్రెండ్ ఇజా పాత్రలో నటిస్తోన్న ఇజా బెల్లె లియెతె లుక్స్‌ను డిసెంబర్ 13న మూవీ యూనిట్ విడుదల చేసింది. శనివారం క్యాతరిన్ ట్రెసా లుక్‌ను విడుదల చేశారు. ఇందులో క్యాతరిన్‌కు, సింగరేణి ప్రాంతానికి లింక్ ఉంది. ఆమె విజయ్‌ను శ్రీనుగా సంబోధిస్తుంది. పాత్ర పరంగా సింగరేణి ప్రాంతంతో తనకున్న రిలేషన్ గురించి “బొగ్గు గనిలో నా బంగారం, నా వరల్డ్ ఫేమస్ లవర్. ఈ వేలంటెన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న శ్రీనును కలుసుకుందాం” అంటూ క్యాతరిన్ మెసేజ్‌ను పోస్ట్ చేసింది.
పోస్టర్ లుక్‌లో ఖాకీ చొక్కా, ప్యాంటు వేసుకుని సింగరేణి కార్మికుడిగా విజయ్ దేవరకొండ, ఆయన గర్ల్‌ఫ్రెండ్ స్మిత పాత్రలో క్యాతరిన్ కనిపిస్తున్నారు. ఇప్పటి వరకు విడుదలైన విజయ్ దేవరకొండ రెండు రూపాలతో పోలిస్తే ఈ రూపం డిఫరెంట్‌గా ఉంది. జనవరి 3న ఈ సినిమా టీజర్ విడుదలవుతుంది. సీనియర్ ప్రొడ్యూసర్ కె.ఎస్. రామారావు సమర్పణలో కియేటివ్ కమర్షియల్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని కె.ఎ.వల్లభ నిర్మిస్తున్నారు. గోపీసుందర్ మ్యూజిక్, జయకృష్ణ గుమ్మడి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



