అలనాటి నటి బి.వి.రాధ కన్నుమూత
on Sep 10, 2017

అలనాటి నాటి బి.వి.రాధ కన్నుమూశారు. ఆమె వయసు 70 సంవత్సరాలు..ప్రస్తుతం కుటుంబసభ్యులతో కలిసి బెంగళూరులో నివసిస్తోన్న ఆమెకు ఈ ఉదయం ఒక్కసారిగా గుండెపోటుకు గురికావడంతో రాధ కుప్పకూలిపోయారు. కుటుంబసభ్యులు ఆసుపత్రికి తీసుకెళ్లినప్పటికీ ఆమె అప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. 1964లో నవకోటి నారాయణ అనే కన్నడ చిత్రం ద్వారా సీనిరంగ ప్రవేశం చేసిన రాధ తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో దాదాపు 300 చిత్రాల్లో నటించారు. అలనాటి అగ్ర కథానాయకులు ఎన్టీఆర్, ఏఎన్నార్, ఎంజీఆర్, శివాజీ గణేశన్ తదితరులతో ఆమె ఆడి పాడారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



