వాళ్ళతో నాన్ డిస్ క్లోజర్ అగ్రిమెంట్.. షాక్ ఇచ్చిన బన్నీ వాసు
on Aug 25, 2025

ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్(Allu Arjun),అట్లీ (Atlee Kumar)కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూవీ ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. సాంకేతికత పరంగా, బడ్జెట్ పరంగా ఇండియాలో తెరకెక్కుతున్న మోస్ట్ ప్రెస్టేజియస్ట్ మూవీల్లో ఒకటిగా నిలిచింది. భారతీయ ప్రేక్షకులకి ఒక సరికొత్త లోకాన్ని పరిచయం చెయ్యబోతున్న ఈ మూవీలో, అగ్ర నటి దీపికా పదుకునే(Deepika Padukune)తో పాటు పలువురు విదేశీ నటులు స్క్రీన్ షేర్ చేసుకోనున్నారు. జైలర్, కూలీ వంటి పలు భారీ చిత్రాలని నిర్మించిన సన్ పిక్చర్స్ అల్లు అర్జున్ కెరీర్ లోనే అత్యంత భారీ వ్యయంతో నిర్మిస్తుంది.
రీసెంట్ గా ప్రముఖ నిర్మాత బన్నీ వాసు(Bunny Vasu)ఈ నెల 27 న విడుదల కానున్న 'కన్యాకుమారి'(Kanyakumari)మూవీ ప్రమోషన్స్ లో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా ఒక విలేకరి బన్నీ వాసు తో 'అల్లు అర్జున్' కొత్త మూవీ గురించి ఏమైనా చెప్తారా అని అడగడం జరిగింది. అప్పుడు బన్నీ వాసు(Bunny Vasu)మాట్లాడుతు సన్ పిక్చర్స్ తో 'నాన్ డిస్ క్లోజర్ అగ్రిమెంట్' ఉంది. ప్రస్తుతం ఏమి మాట్లాడలేను. ఏదైనా చెబితే సన్ పిక్చర్స్ వాళ్లే చెప్పాలని బదులిచ్చాడు.
అల్లుఅర్జున్ కి సుదీర్ఘ కాలం నుంచి స్నేహితుడిగా ఉంటు వస్తున్న బన్నీ వాసు, జిఏ 2 బ్యానర్ పై పలు హిట్ చిత్రాలు నిర్మించాడు. రీసెంట్ గా అక్కినేని నాగచైతన్య(Naga Chaitanya)తో తండేల్ ని నిర్మించి మంచి విజయాన్ని అందుకున్నాడు. అల్లు అర్జున్, అట్లీ ప్రాజెక్ట్స్ కి సంబందించిన పనుల్లో బన్నీ వాసు కీలక పాత్ర పోషిస్తు వస్తున్నాడు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



