బన్నీని భుజాలపై మోసి ' సెన్సేషన్ ' చేసిన రానా
on Mar 6, 2016
టాలీవుడ్ లో ఒకప్పుడు హీరోల మధ్య రైవలరీ ఉండేది. ఒక హీరో ఇంకో హీరోతో మాట్లాడటమే గగనం. ఏదో కలిసినప్పుడు హాయ్ అంటే హాయ్ అనుకునేవారంతే. కానీ యంగ్ జనరేషన్ స్టార్స్ మొత్తం రూల్స్ ను తిరగరాస్తున్నారు. ఒకరితో ఒకరు కలిసి మెలిసి తిరగడమే కాక, అవసరమైతే ఒకరి కోసం మరొకరు తగ్గుతున్నారు. లేటెస్ట్ గా దగ్గుబాటి, అల్లు ఫ్యామిలీల వారసులిద్దరూ ఒక ఈవెంట్ లో ఎంతలా ఇరగదీశారో ఈ పోటో చూడండి.

నిన్న గచ్చిబౌలి స్టేడియంలో సెన్సేషన్ ఇండియా పేరుతో మ్యూజికల్ కన్సర్ట్ జరిగింది. ఈ సందర్భంగా రానా బన్నీని తన భుజాల మీద ఎక్కించుకుని డ్యాన్స్ వేశాడు. రానా తన ట్విట్టర్లో పోస్ట్ చేసిన ఈ ఫోటో ఇప్పుడు నెటిజన్లకు హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ ఈ సెన్సేషన్ ప్రోగ్రాంకు కేవలం వైట్ అండ్ వైట్ లోనే రావాలన్నది రూల్. పెద్ద స్టార్స్ నుంచి హీరోయిన్ల వరకూ అందరూ ఈ ప్రోగ్రాంలో ఫుల్ గా ఎంజాయ్ చేస్తూ మెరిసిపోయారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



