
సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu)కాజల్ అగర్వాల్, సమంత, ప్రణీత హీరోయిన్లుగా భారీ తారాగణంతో 2016 లో వచ్చిన ఫ్యామిలీ డ్రామా చిత్రం 'బ్రహ్మోత్సవం'. క్లాసిక్ డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో, ప్రముఖ నిర్మాణ సంస్థ పీవీపీ సినిమాస్ బ్యానర్‌పై పొట్లూరి వీరప్రసాద్ (పీవీపీ) దాదాపు 75 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో నిర్మించాడు . భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయాన్ని చవిచూసింది. కేవలం 63.70 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను మాత్రమే సాధించి, డిస్ట్రిబ్యూటర్లకి ,ఎగ్జిబిటర్లకి భారీ నష్టాలని మిగిల్చింది. మూవీ రిలీజైన చాలా రోజుల తర్వాత తాజాగా పీవీపీ బ్రహ్మోత్సవం గురించి చేసిన సంచలన వ్యాఖ్యలు టాలీవుడ్‌లో సరికొత్త హాట్ టాపిక్‌గా మారాయి. డిజాస్టర్ కి అసలు కారణం ఎవరో ఓపెన్‌గా వెల్లడించాడు .
పివిపి మాట్లాడుతు బ్రహ్మోత్సవం ఫ్లాప్ కావడానికి పూర్తి బాధ్యత దర్శకుడు శ్రీకాంత్ అడ్డాలదే. షూటింగ్ ప్రారంభానికి కొన్ని రోజుల ముందే దర్శకుడికి ఒక అధికారిక ఈమెయిల్ పంపాను. సదరు మెయిల్ లో స్క్రిప్ట్ వర్క్ పూర్తిగా పూర్తి కాకుండా ఎటువంటి పరిస్థితుల్లోను షూటింగ్ ప్రారంభించవద్దని హెచ్చరించాను. సినిమా అనేది కేవలం ఒకరి ఇష్టం కాదు .డిస్ట్రిబ్యూటర్స్ ,ఎగ్జిబిటర్స్ పెట్టిన పెట్టుబడులతో, వారి నమ్మకంతో మనం సినిమా చేస్తున్నాం. సరైన ప్రణాళిక లేకపోతే వారికి తీవ్ర అన్యాయం జరుగుతుందని దర్శకుడికి ముందే చెప్పాను.
Also read: ఫ్యాన్స్‌కి బిగ్ షాక్.. ఆ ఏరియాలో పెద్ది రిలీజ్ క్యాన్సిల్
బ్రహ్మోత్సవం అనేది ఒక మంచి లైన్, అద్భుతమైన కుటుంబ కథాంశం. కానీ దర్శకుడు సినిమా సెట్స్‌పైకి వెళ్లే ముందు పూర్తి స్థాయి కథని, బౌండ్ స్క్రిప్ట్ సిద్ధం చేయడంలో పూర్తిగా విఫలమయ్యాడు. దర్శకుడి నిర్లక్ష్యం, క్రమశిక్షణ లేకపోవడం వల్లే అంత పెద్ద ప్రాజెక్ట్ బాక్సాఫీస్ వద్ద దారుణంగా దెబ్బతింది. ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్యల్లో బాధ్యతారాహిత్యం, పక్కా డిసిప్లిన్ లేకపోవడం కూడా ఒకటని పీవీపీ విమర్శించారు. ప్రస్తుతం పీవీపీ చేసిన ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.






