
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan)గ్లోబల్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆర్ఆర్ఆర్ అందించిన భారీ విజయంతో జపాన్ దేశంలో ఊహించని స్థాయిలో చరణ్ కి ఫ్యాన్ బేస్ ఏర్పడింది. ఎంతలా అంటే చరణ్ ని చూడటానికి హైదరాబాద్ కూడా వచ్చేంతలా. దీంతో చరణ్ తో పాటు మేకర్స్ 'పెద్ది'(Peddi)ని జూన్ 4 న జపాన్‌లోనూ ఒకే రోజున విడుదల చేయడానికి మేకర్స్ ఏర్పాట్లు పూర్తి చేశారు. దీంతో అక్కడి అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అడ్వాన్స్ బుకింగ్స్ కోసం వారు ఎంతగానో ఎదురుచూశారు.
అయితే జపాన్ రిలీజ్ విషయంలో అనూహ్యమైన పరిణామం చోటుచేసుకుంది. జపాన్‌లో ఈ సినిమా పంపిణీ బాధ్యతలు చూస్తున్న 'ఇండో ఈగా' (Indo Eiga) సంస్థ సామాజిక మాధ్యమాల ద్వారా రిలీజ్ పై స్పందిస్తు కొన్ని అనివార్య సాంకేతిక కారణాలు,ఊహించని పరిస్థితుల వల్ల జపాన్‌లో జూన్ 4న జరగాల్సిన 'పెద్ది' ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్ వర్షన్ స్పెషల్ స్క్రీనింగ్స్ పూర్తిగా రద్దు అయ్యాయని అధికారికంగా ప్రకటించింది. ఎంతో కాలంగా మెగా పవర్ స్టార్ సినిమా కోసం వేచి చూస్తున్న జపాన్ దేశపు స్థానిక అభిమానులతో పాటు, అక్కడ నివసిస్తున్న భారతీయ సినీ ప్రియులకి కూడా ఈ నిర్ణయం తీవ్ర నిరాశని మిగిల్చింది. అర్ధరాత్రి నుంచి అడ్వాన్స్ టికెట్ల విక్రయాలు ప్రారంభం కావాల్సి ఉండగా, అంతలోనే ఈ రద్దు ప్రకటన వెలువడటంతో సోషల్ మీడియాలో జపనీస్ ఫ్యాన్స్ తీవ్ర విచారాన్ని వ్యక్తం చేస్తున్నారు.
also read: Tollywood Trending: టాలీవుడ్ ట్రెండింగ్ లో ఈ రోజు హెడ్ లైన్స్ చూద్దాం





