Home

»

Latest News

మేన‌కోడలిని హీరోయిన్‌గా ఇంట్ర‌డ్యూస్ చేస్తున్న స‌ల్మాన్ ఖాన్‌!

Nov 29, 2021 3:06PM

 

స‌ల్మాన్ ఖాన్ మేన‌కోడ‌లు, 21 సంవ‌త్స‌రాల అలీజేహ్ అగ్నిహోత్రి హీరోయిన్‌గా బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతోంది. ఆమె తొలి చిత్రం వ‌చ్చే నెల‌లో ప్రారంభం కానున్న‌ది. రొమాంటిక్ డ్రామాగా త‌యార‌య్యే ఈ మూవీని స‌ల్మాన్‌, నిఖిల్ న‌మిత్‌తో పాటు అలీజేహ్ త‌ల్లితండ్రులు అల్విరా, అతుల్ అగ్నిహోత్రి నిర్మించ‌నున్నారు. బ‌డ్జెట్ విష‌యంలో ఏమాత్రం రాజీప‌డ‌కుండా ఈ సినిమాని తీసేందుకు స‌ల్మాన్ ప్లాన్ చేస్తున్నాడు. రెండేళ్లుగా అలీజేహ్ న‌ట‌న‌లో, డాన్సింగ్‌లో శిక్ష‌ణ తీసుకుంటూ వ‌చ్చింది. దాంతో ఆమెను హీరోయిన్‌గా ప‌రిచ‌యం చేయ‌డానికి ఇదే స‌రైన స‌మ‌య‌మ‌ని అల్విరా, అతుల్‌, స‌ల్మాన్ భావిస్తున్నారు.

స‌ల్మాన్ ఖాన్ ప్రొడ‌క్ష‌న్స్‌, రీల్ లైఫ్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్ల‌పై నిర్మాణ‌మ‌య్యే ఈ సినిమాకు ద‌ర్శ‌కుడెవ‌ర‌నే విష‌యాన్ని అతి త్వ‌ర‌లోనే ప్ర‌క‌టించ‌నున్నారు. ఇది అలీజేహ్ తొలి చిత్రం కాబ‌ట్టి స‌ల్మాన్ ప్ర‌తి విష‌యంలోనూ ప‌ర్స‌న‌ల్ ఇంట‌రెస్ట్ తీసుకుని ప‌ర్య‌వేక్షిస్తున్నాడు. ఆమె అంటే బాగా ఇష్ట‌ప‌డే స‌ల్మాన్ ఆమె ట్రైనింగ్ అప్‌డేట్స్ కూడా ఎప్ప‌టిక‌ప్పుడు తెలుసుకుంటూ వ‌చ్చాడు. స్ట‌న్నింగ్ బ్యూటీ కావ‌డ‌మే కాకుండా, స్వ‌త‌హాగా టాలెంటెడ్ ప‌ర్స‌న్ అయిన అలీజేహ్ స‌ర‌స‌న హీరోగా ఎవ‌రు న‌టిస్తార‌నేది కూడా ఆస‌క్తిక‌రంగా మారింది. 

Also read:  ఖాన్ త్ర‌యం బాలీవుడ్ గ్రేటెస్ట్ యాక్ట‌ర్స్‌.. ఇది స‌న్నీ లియోన్ లెక్క‌!

2022లో షూటింగ్ ప్రారంభ‌మ‌య్యే ఈ సినిమా 2023లో రిలీజ‌వుతుంది. గ‌తంలో స‌ల్మాన్ క్లోజ్ ఫ్రెండ్ అయిన సీనియ‌ర్ డైరెక్ట‌ర్ సూర‌జ్ బ‌ర్జాత్యా కుమారుడు అవినాశ్ డైరెక్ష‌న్‌లో అలీజేహ్ హీరోయిన్‌గా ప‌రిచ‌యం అవుతుంద‌ని ప్ర‌చారం జ‌రిగింది కానీ, అది వ‌ర్క‌వుట్ కాలేదు. నిజానికి అవినాశ్‌ను డైరెక్ట‌ర్‌గా ప‌రిచయం చేస్తూ సూర‌జ్ నిర్మిస్తున్న‌ సినిమాలో స‌న్నీ డియోల్ రెండో కొడుకు రాజ్‌వీర్ హీరోగా ఇంట్ర‌డ్యూస్ అవుతున్నాడు. ఈ మూవీతో అలీజేహ్ హీరోయిన్‌గా ప‌రిచ‌యం అయిన‌ట్ల‌యితే ఆ కాంబినేష‌న్ అదిరిపోయి ఉండేది. కానీ ఆ మూవీలో అలీజేహ్ న‌టించ‌డం లేదు.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com