Home

»

Latest News

అక్కడ పోస్తే "కబాలి" టికెట్ ఫ్రీ!

Jul 2, 2016 11:55AM

"మా షాపింగ్ మాల్ లో షాపింగ్ చేయండి.. ఫలానా స్టార్ ని డైరెక్ట గా కలిసే అవకాశం పొందండి" లేదా "ఫోన్ చేయండి.. స్టార్ తో మాట్లాడండి" లాంటి ప్రకటనలు మనం రోజూ ఏదో ఒకచోట చూస్తూనే ఉంటాం. కానీ.. ఎప్పుడైనా "ఉచ్చ పోయండి.. టికెట్ గెలుచుకోండి" అనే ఆఫర్ ను చూసారా.. కనీసం ఇలాంటి ఆఫర్ గురించి ఎప్పుడైనా విన్నారా?

పుదుచ్చేరి గవర్నర్ కిరణ్ బేడీ ఈ ఆఫర్ ను ప్రకటించింది. విషయం ఏంటంటే.. "కబాలి" మరికొద్ది రోజుల్లో విడుదల కానుండడం, ఆ సినిమాకు గల క్రేజ్ ను దృష్టిలో ఉంచుకొని.. బహిరంగంగా మూత్రవిసర్జన చేయకుండా.. గవర్నమెంట్ వారు నిర్మించిన "పబ్లిక్ టాయిలెట్స్"ను వినియోగించినవారికి "కబాలి" టికెట్స్ ఫ్రీగా ఇస్తామని ప్రకటించిందట. దాంతో.. ఇప్పుడూ పబ్లిక్ టాయిలెట్స్ దగ్గర జనాలు క్యూలో నిల్చోంటున్నారట. సో, మన ఆలిండియా స్టార్ రజనీ ఈ విధంగా తనకు తెలియకుండానే స్వచ్చ భారత్ ప్రోగ్రామ్ కి, పూడిచ్చేరి గవర్నమెంట్ కు ఉపయోగపడుతున్నాడన్నమాట!

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com