బోయపాటి శ్రీను దర్శకత్వంలో సూర్య!
on Jun 22, 2023

బోయపాటి శ్రీను దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ బ్యానర్ లో ఓ సినిమా ఉంటుందని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో ఈ సినిమాలో హీరోగా ఎవరు నటిస్తారనే ఆసక్తి అందరిలో నెలకొంది. అయితే ఈ సినిమా కోసం కోలీవుడ్ స్టార్ సూర్యని రంగంలోకి దింపుతున్నట్లు తెలుస్తోంది.
బోయపాటి-సూర్య కాంబినేషన్ లో సినిమా అంటూ గతంలోనూ వార్తలొచ్చాయి. అయితే ఈసారి నిజంగానే ఈ కాంబోలో మూవీ ఖరారైంది అంటున్నారు. ఈ కాంబోలో మూవీ ప్రకటన వస్తే ఒక్కసారిగా మాస్ ఆడియన్స్ లో అంచనాలు భారీ స్థాయిలో ఏర్పడతాయి. బోయపాటి మాస్ సినిమాలు తీయడంలో దిట్ట. ఇక సూర్య అన్ని రకాల పాత్రలు పోషించగల అతికొద్ది మంది నటుల్లో ఒకరు. మాస్ రోల్స్ లోనూ ఆయన చక్కగా ఒదిగిపోతారు. 'సింగం' సిరీస్ లో ఉగ్రరూపం చూపించారు. 'విక్రమ్' సినిమాలో రోలెక్స్ గా కాసేపే కనిపించినా తీవ్ర ప్రభావం చూపగలిగారు. అలాంటి సూర్యతో బోయపాటి తన మార్క్ మాస్ సినిమా తీస్తే బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురవడం ఖాయమనే అభిప్రాయాలున్నాయి. ఈ క్రేజీ కాంబోని గీతా ఆర్ట్స్ సెట్ చేసిందట. ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో రుపొందనుందని సమాచారం.
ప్రస్తుతం రామ్ బోతినేని హీరోగా బోయపాటి ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ తర్వాత సూర్య ప్రాజెక్ట్ తో బోయపాటి బిజీ కానున్నారని వినికిడి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



