అనుష్క పెళ్ళి.. మీడియాకి షాక్...!
on Dec 27, 2016
.jpg)
ప్రస్తుతం టాలీవుడ్‌లో ఇదే హాట్ టాపిక్. అనుష్క త్వరలో పెళ్ళి చేసుకోబోతోంది. అదీ టాలీవుడ్ కు చెందిన టాప్ నిర్మాతతో. ఇది పరిశ్రమలో పెద్ద సంచలనంగా మారింది. వీరిద్దరూ గత కొన్ని సంవత్సరాలుగా ఎంతో అన్యోన్యంగా ఉంటున్నట్లు టాక్. పరిశ్రమలోని వారందరికీ ఈ విషయం తెలుసు. అనుష్కతో నిర్మాత అన్యోన్యంగా ఉంటున్న విషయం నిర్మాత కుటుంబ సభ్యులకు కూడా తెలుసని నిర్మాతకు చెందిన సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఆయన ఇఫ్పటికే అనుష్కతో పలు సినిమాలు కూడా నిర్మించారు. అయితే ఇఫ్పటికే పెళ్ళి అయిన ఆ నిర్మాతతో వివాహానికి అనుష్క కుటుంబ సభ్యులు అంగీకరిస్తారా? లేదా అన్నదే ఇప్పుడు పెద్ద ప్రశ్న. అయితే ఈ పెళ్ళికి అనుష్క, ఆ నిర్మాత మాత్రం పూర్తిగా రెడీ అయిపోయారని వార్తలు వస్తున్న సమయంలో అనుష్క ఆ వార్తలను కొట్టిపారేసింది. కాగా కన్నడ మీడియాలో మాత్రం తాజాగా అనుష్క పెళ్ళి తన పేరెంట్స్ ఒక ప్రముఖ వ్యాపార వేత్త తో ఫిక్స్ చేశారని దానికి అనుష్క కూడా అంగీకరించడం జరిగిందని తొందరలోనే దీని గురించి అనుష్క మీడియాకు వెల్లడిస్తుందని వార్తలు హల్ చల్ చేస్తున్న సమంతో అనుష్క మళ్ళీ మీడియా ముందుకొచ్చి... పెళ్లి మనం అనుకున్నప్పుడు అనుకున్న వ్యక్తితో జరగదు. ఆ ఘడియలు రావాలి అప్పుడే జరుగుతుంది. నాకింకా ఆ ఘడియలు రాలేదేమో. ప్రస్తుతం నా దృష్టి సినిమాలపై వుంది అంటూ మీడియాకి షాక్ ఇచ్చింది. ఇంతకి అనుష్క వయస్సు ఎంతో తెలుసా 35సంవత్సరాలు... ఇప్పటికీ అనుష్కకు పెళ్ళి ఘడియాలు రాలేదంటే మరి ఎప్పటికి వస్తాయో ఏమో పాపం.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



