రామ్ చరణ్ నిలబడతాడా? వెనక్కి తగ్గుతాడా?
on Feb 26, 2023

ఈ ఏడాది సంక్రాంతికి ఒకే బ్యానర్ నుంచి వచ్చిన రెండు సినిమాలు విడుదలయ్యాయి. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన 'వాల్తేరు వీరయ్య', 'వీర సింహా రెడ్డి' ఒక్కరోజు తేడాతో విడుదలై రెండూ విజయం సాధించాయి. అయితే వచ్చే ఏడాది సంక్రాంతికి ఒకే దర్శకుడు రూపొందించిన రెండు సినిమాలు విడుదలయ్యే అవకాశాలు కనిపిసున్నాయి. ఆయన ఎవరో కాదు కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్.
శంకర్ ఒకేసారి రెండు భారీ చిత్రాలను తెరకెక్కిస్తున్నారు. అందులో ఒకటి రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న 'RC 15' కాగా, రెండోది కమల్ హాసన్ నటిస్తున్న 'ఇండియన్-2'. 'RC 15'ని భారీ బడ్జెట్ తో దిల్ రాజు నిర్మిస్తుండగా.. 'ఇండియన్-2'ని లైకా ప్రొడక్షన్స్, రెడ్ జైంట్ మూవీస్ సంయుక్తంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాయి. అయితే ఈ రెండు చిత్రాలను మేకర్స్ ఎవరికి వారు ఎట్టి పరిస్థితుల్లోనూ సంక్రాంతికే విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తుండటం డైరెక్టర్ శంకర్ కి తలనొప్పిగా మారిందని అంటున్నారు. ఒక చిత్రాన్ని సంక్రాంతికి, మరో చిత్రాన్ని వేసవికి విడుదల చేసేలా నిర్మాతలను ఒప్పించడానికి శంకర్ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. మరి శంకర్ చర్చలు ఫలించి.. ఈ రెండు సినిమాల్లో ఒకటి వెనక్కి తగ్గుతుందా? ఒకవేళ తగ్గితే ఏది తగ్గుతుంది? లేదా తగ్గేదేలే అంటూ రెండు సినిమాలు సంక్రాంతికే వస్తాయో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



