దిల్ రాజు సెంటిమెంట్ తెలిస్తే షాక్
on Jul 27, 2018

దిల్ రాజు నిర్మించిన చిత్రాలలో తనకి,తన బ్యానర్ కి ఎంతో పేరు తెచ్చి తన కెరీర్ లో మైలు రాయిగా నిలిచిన చిత్రం బొమ్మరిల్లు.కుటుంబం కథ నేపధ్యంలో వినోదాత్మకంగా తెరెకెక్కిన ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించింది.ప్రస్తుతం ఆయన నిర్మించిన శ్రీనివాస కళ్యాణం విడుదలకు సిద్దమవుతుంది.నితిన్,రాశిఖన్నా జంటగా నటించిన ఈ చిత్రానికి సతీష్ వేగ్నేష్ దర్శకత్వం వహిస్తున్నారు.ఈ చిత్రాన్ని 9 ఆగష్టు అనగా 12 ఏళ్ల క్రితం బొమ్మరిల్లు రిలీజ్ అయిన రోజున విడుదల చేస్తున్నట్లు దిల్ రాజు తెలిపారు.ఇదే రోజు సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టిన రోజు కూడా. బొమ్మరిల్లు, శతమానం భవతి వంటి చిత్రాల తరువాత కుటుంబ కథ నేపథ్యంలో వస్తున్న చిత్రం శ్రీనివాస కళ్యాణం.
ఇప్పటికే పెళ్లి నేపధ్యం లో చాలా సినిమాలు వచ్చాయి మరి ఈ చిత్రం లో కొత్తదనం ఏముంటుంది అనుకుంటారు కానీ ఈ సినిమా చూసిన తరువాత ప్రతి ప్రేక్షకుడు కొత్త అనుభూతితో బయటకు వస్తారని తెలిపారు.బొమ్మరిల్లు,శతమానం భవతి చిత్రాలను ప్రేక్షకులు ఆదరించారు అలానే ఈ చిత్రాన్ని కూడా ఆదరిస్తారని,ఆ మ్యాజిక్ రిపీట్ అవుతుందనటంలో ఏలాంటి సందేహం లేదని ఆశాభావం వ్యక్తంచేశారు.మా జీవితాన్ని చూపించారని అమ్మమ్మ తాతయ్యలు,తమ పిల్లల పెళ్లి ఇలానే చేయాలి అని తల్లి తండ్రులు, పెళ్లంటే ఇలానే చేసుకోవాలని అమ్మాయిలు,అబ్బాయిలు అనుకుంటారన్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



