క్రేజీ కాంబో.. బాబీ దర్శకత్వంలో సూపర్ స్టార్!
on Apr 12, 2023

ప్రముఖ నిర్మాత దిల్ రాజు టాలీవుడ్ ని, కోలీవుడ్ ని కలుపుతూ క్రేజీ కాంబినేషన్స్ లో సినిమాలు చేస్తున్నారు. ఇప్పటికే దర్శకుడు వంశీ పైడిపల్లి, దళపతి విజయ్ కలయికలో 'వారిసు'(వారసుడు) సినిమా చేసిన దిల్ రాజు.. ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబోలో ''గేమ్ ఛేంజర్' మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు మరో క్రేజీ కాంబోలో సినిమా చేయబోతున్నట్లు సమాచారం.
సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా దిల్ రాజు ఓ భారీ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. ఈ సినిమాకి బాబీ కొల్లి దర్శకత్వం వహించనున్నాడని తెలుస్తోంది. ఈ ఏడాది మెగాస్టార్ చిరంజీవి టైటిల్ రోల్ పోషించిన 'వాల్తేరు వీరయ్య'తో బాబీ బ్లాక్ బస్టర్ అందుకున్న విషయం తెలిసిందే. అదే ఉత్సాహంలో ఇప్పుడు సూపర్ స్టార్ ని డైరెక్ట్ చేసే ఛాన్స్ దక్కించుకున్నట్లు వినికిడి. రజినీకాంత్ ప్రస్తుతం నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో 'జైలర్'తో పాటు, జ్ఞానవేల్ డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్నారు. వాటి తర్వాత ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కే అవకాశముంది. త్వరలోనే దిల్ రాజు- రజినీకాంత్-బాబీ కాంబో మూవీ అధికారిక ప్రకటన రానుందని అంటున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



