బర్త్‌డే స్పెషల్.. లవ్‌లీ వైఫ్ సామ్‌తో చైతూ హాట్ ఫొటోస్!
on Nov 23, 2020

నవంబర్ 23, అంటే ఈ రోజు అక్కినేని నాగచైతన్య బర్త్‌డే. అయితే ఈ టైమ్‌లో అతను హైదరాబాద్‌లో కాకుండా మాల్దీవుల్లో భార్య సమంతతో కలిసి విహార యాత్రలో ఉన్నాడు. కొన్ని ప్రేమకథలు స్వర్గంలోనే తయారవుతాయంటారు. సమంత, చైతు ప్రేమకథ కూడా అలాగే అనిపిస్తుంది. 'ఏ మాయ చేశావే' సినిమాలో తొలిసారి కలిసి నటించిన ఆ జంట ప్రయాణం మొదట స్నేహంతో మొదలైంది. ఆ తర్వాత కొంత కాలానికి తమ మధ్య స్నేహాన్ని మించిన బంధం పెనవేసుకుంటోందనీ, అది ప్రేమనీ వాళ్లు తెలుసుకున్నారు. ఆ తర్వాత ఏం జరిగిందో మనకు తెలుసు. 2017లో వాళ్లు దంపతులయ్యారు.
ముందుగానే ఒకరినొకరు అర్థం చేసుకున్న స్నేహితులు కావడం వల్ల దాంపత్య జీవితం వారికి స్వర్గధామంలో మారింది. సమంత ప్రొఫెషనల్ లైఫ్‌కు చైతు ఏమాత్రం అడ్డు నిలవలేదు. పైగా ఆమెను ఎంకరేజ్ చేస్తూ వస్తున్నాడు. నిజం చెప్పాలంటే వివాహానంతరం చైతూ నటనలో మరింత మెచ్యూరిటీ కనిపిస్తోంది. 'మజిలీ' సినిమా అతనిలో ఎంత ఉత్తమ నటుడు ఉన్నాడో మనకు తెలియజేసింది. ఇటీవలే అతను శేఖర్ కమ్ముల సినిమా 'లవ్ స్టోరి' షూటింగ్ ఫినిష్ చేశాడు. ఆ సినిమాలోని ఓ పాట టీజర్‌లో చైతూ ప్రదర్శించిన హావభావాలు చూసి శభాష్ అన్నవాళ్లెందరో.
బర్త్‌డే సందర్భంగా అందమైన చై-సామ్ జంట అనురాగాన్ని, ప్రేమానుబంధాన్ని తెలియజేసే కొన్ని ఫొటోలను షేర్ చేసుకుందాం. అవి అభిమానులను అలరిస్తాయనడంలో సందేహం లేదు.
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



