‘బిగ్బాస్' హౌస్లోకి వెళ్ళేది ఎంతమంది అంటే?
on Aug 4, 2020
'బిగ్ బాస్' రియాలిటీ షో సీజన్ 4 స్టార్ట్ కావడానికి అంతా రెడీ. ఆల్రెడీ ఇంటిని కొత్తగా డెకరేట్ చేశారు. కింగ్ నాగార్జునతో ప్రోమోలు షూట్ చేశారు. కంటెస్టెంట్లను సెలెక్ట్ చేశారు. ఆగస్టు 30 నుండి షో స్టార్ట్ కానుందని టాక్. హౌస్లోకి పంపించే కంటెస్టెంట్లను కూడా సెలెక్ట్ చేశారని విశ్వసనీయ వర్గాల సమాచారం.
'బిగ్ బాస్' ఆఫర్లకు యుంగ్ హీరోలు కార్తికేయ, సిద్ధూ జొన్నలగడ్డ, నందు తదితరులు హాట్ బ్యూటీలు శ్రద్ధా దాస్, పూనమ్ కౌర్ నో చెప్పారని ఫిలింనగర్ మాట. అయితే, ఇంకొంతమంది క్రేజీ సెలబ్రిటీలు ఎస్ అన్నారట. జూమ్ వీడియో కాలింగ్ ద్వారా చాలామంది ఆడిషన్లు చేసిన 'బిగ్ బాస్' టీమ్, చివరికి 30 మందిని ఫిల్టర్ చేసినట్టు స్టార్ మా ఛానల్ టాక్. అందులో 16 మందిని హౌస్లోకి పంపిస్తారట. లాస్ట్ సీజన్ కంటే ఈ సీజన్ తక్కువ రోజులు ఉంటుందని బయట జనాలు అనుకుంటున్నప్పటికీ... ప్రేక్షకుల నుండి వచ్చే స్పందన బట్టి పొడిగించే ఛాన్సులు కూడా ఉన్నాయట.