లాస్య.. బకరా, అభిజిత్.. చెత్తకుండీ.. ట్యాగ్స్ ఇచ్చిన సొహైల్, అరియానా!
on Sep 13, 2020
మునుపటి ఎపిసోడ్లతో పోలిస్తే బిగ్ బాస్ 4 వీకెండ్ ఎపిసోడ్ కాస్త జోష్‌గానే సాగిందని చెప్పాలి. ఒక్కో కంటెస్టెంట్ గురించి ఒక్కో రకమైన కామెండ్ చేస్తూ, వాళ్ల బలాలు బలహీనతలను ఎత్తిచూపుతూ, వాళ్లకు సజెషన్స్ ఇస్తూ నాగార్జున షోలో ఇంటెన్సిటీ పెంచారు. ఇదివరకు సయ్యద్ సొహైల్, అరియానా గ్లోరీలకు ఒక టాస్క్ ఇచ్చిన నాగ్.. ఇప్పుడు మరో టాస్క్ ఇచ్చారు. స్టోర్ రూంలో ఉన్న మెడల్స్ తీసుకువచ్చి, ఎవరికి ఏ మెడల్ నప్పుతుందో అందుకు తగ్గట్టుగా వారి మెడలో వేయమని చెప్పారు. మెడల్స్ పై ఉన్న ట్యాగ్ ల ప్రకారం సోహైల్, అరియానా వాటిని సభ్యుల మెడలో వేశారు. ఎవరికి ఏ ట్యాగ్ వచ్చిందంటే..
జోర్దార్ సుజాత - ఊసరవెల్లి
దివి విథ్య - కాకరకాయ
అఖిల్ సార్థక్ - రొమాంటిక్
కరాటే కళ్యాణి - చిచ్చు పెట్టడం
దేత్తడి హారిక - డ్రామా క్వీన్
సూర్యకిరణ్ - బద్దకం
అభిజిత్ దుడ్డాల - చెత్త కుండీ
నోయల్ షాన్ - లౌడ్ స్పీకర్
గంగవ్వ - తోపు
దేవి - పర్ఫెక్ట్
మోనాల్ గజ్జర్ - క్రై బేబీ
లాస్య మంజునాథ్ - బకరా
మెహబూబ్ షేక్ - మిర్చి
అమ్మ రాజశేఖర్ - జోకర్
ఎందుకు ఆ ట్యాగ్‌కు వారినే ఎంచుకున్నారో వివరణ ఇస్తూ హౌస్ సభ్యులను సత్కరించారు సొహైల్, అరియానా. ఈ సీన్ లో నాగార్జున కామెంట్స్ , కంటెస్టెంట్ల రియాక్షన్ లు కాస్త ఫన్ పండించాయి.
అందరిలోకి తోపు గంగవ్వ అంటూ సభ్యులంతా చప్పట్లతో చెప్పారు. మోడ్రన్ ఉమెన్ కన్నా గంగవ్వ చాలా ఎక్కువ అంటూ గంగవ్వ గురించి అరియానా ఇచ్చిన వివరణతో నాగార్జున కూడా ఫిదా అయిపోయారు. ప్లయింగ్ కిస్ లతో గంగవ్వ పై ఆప్యాయత కురిపించారు. హౌస్ లో ఫస్ట్ నుంచి స్పెషల్ అట్రాక్షన్ గా ఉన్న గంగవ్వ వీకెండ్ షోలోనూ తన ప్రత్యేకత చాటుకున్నారు.
Also Read