కిడ్నాప్‌ని క్యాష్ చేసుకుంటున్న భావన!
on Apr 6, 2017

మలయాళం హీరోయిన్ భావన కిడ్నాప్ ఉదంతం యావత్ దేశాన్ని షాక్ కి గురి చేసింది. భావన ఇప్పట్లో ఇంకా సినిమాలు చేయదేమో, పాపం ఎలా తేరుకుంటుందో అనుకున్నారు అంతా. కానీ, తాను అందరి లాంటి అమ్మాయిని కాదని, ధైర్యవంతురాలినని నిరూపిస్తూ రెండు సినిమాలు ఒప్పుకోవడమే కాకుండా, ఆ సంఘటన జరిగిన వారం రోజులకే షూటింగ్ లో పాల్గొంది. అంతే కాకుండా, గత కొన్ని నెలలుగా ప్రేమాయణం నడిపిస్తున్న ఒక మలయాళం నిర్మాతతో ఎంగేజ్మెంట్ చేసుకొని అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఇదిలా ఉంటె, భావన ఒక టీవీ యాడ్ తో మళ్ళీ వార్తల్లోకెక్కింది.
ఒక ప్రముఖ టీ కంపెనీ వాళ్ళు భావనని బ్రాండ్ అంబాసడర్ గా తీసుకొని ఒక యాడ్ కూడా షూట్ చేసారు. అయితే, ఈ యాడ్‌కి భిన్న అభిప్రాయాలొస్తున్నాయి. దీంట్లో, భావన ఆత్మస్థైర్యం, ప్రతికూల పరిస్థితులు ఎదురుకోవడం లాంటి పదాలు వాడుతుంది. "పరిస్థితులు బాలేనప్పుడే మనలో ఆత్మస్థైర్యం ఎంతుంది అనే విషయం మనకి తెలిసి వస్తుంది," అని భావన ఆ యాడ్ లో చెబుతుంది. కొందరు భావనని సమర్ధిస్తే, మరి కొందరు తప్పు పడుతున్నారు. భావన చాలా స్ట్రాంగ్ అనేది కొందరి ఒపీనియన్ అయితే, ఆమె తనకి జరిగిన సంఘటనని క్యాష్ చేసుకునే పనులు చేస్తుందని ఇతరులు అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా, భావన ఆ సంఘటన నుండి బయటకు రావడం అనేది చాలా గొప్ప విషయం. ఎంత మందికి ఉంటుంది చెప్పండి అంత ధైర్యం. ఈ విషయంలో మాత్రం భావనని మెచ్చుకోవాల్సిందే, మీరేమంటారు!
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



