భైరవం ఓటిటి డేట్ వచ్చేసింది.. ఆరోజు పండగే
on Jul 8, 2025

బెల్లంకొండ సాయి శ్రీనివాస్(Bellamkonda sai srinivas)మంచు మనోజ్(Manchu Manoj), నారా రోహిత్(Nara Rohith)కాంబోలో మే 30 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూవీ భైరవం(Bhairavam). యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీకి నాంది, ఉగ్రం చిత్రాల ఫేమ్ 'విజయ్ కనకమేడల' దర్శకత్వం వహించాడు. ఆదితి శంకర్, దివ్యా పిళ్లై, ఆనంది, జయసుధ, అజయ్, రాజా రవీంద్ర, శరత్ లోహిత్సవ ఇతర పాత్రల్లో కనిపించారు.
ఇప్పుడు ఈ మూవీ జూలై 18 నుంచి ఓటిటి వేదికగా జీ 5 (Zee 5)లో స్ట్రీమింగ్ కాబోతుంది. తెలుగుతో పాటు హిందీ లాంగ్వేజ్ లో అందుబాటులో ఉండనుంది. థియేటర్స్ లో మంచి అదరణనే దక్కించుకున్న భైరవం ఓటీటీ లో కూడా అంతే ఆదరణని దక్కించుకుంటుందనే ఆశాభావంతో చిత్ర బృందం ఉంది. శీను, గజపతి వర్మ, వరద అనే ప్రాణ స్నేహితుల క్యారెక్టర్స్ లో సాయి శ్రీనివాస్, మనోజ్, రోహిత్ లు తమ కెరీర్ లోనే భైరవం ద్వారా అత్యుత్తమ పెర్ ఫార్మెన్సు ని ప్రదర్శించారు. మిగతా ఆర్టిస్టులు కూడా తమ సహజ నటనతో మూవీకి నిండు తనాన్ని తీసుకొచ్చారు. వెయ్యి కోట్లు విలువైన వారాహి అమ్మవారి ఆలయ భూముల్ని రాజకీయ నాయకుడు ఆక్రమించాలని అనుకుంటాడు.
ఆ భూమిని కాపాడేందుకు శీను, గజపతి వర్మ, వరద ఏమైనా ప్రయత్నాలు చేసారా? లేక రాజకీయం వాళ్ళ స్నేహాన్ని చెడగొట్టి గుడి భూముల విషయంలో వేరు వేరు నిర్ణయాలు తీసుకునేలా చేసిందా? చివరకి ఆ ముగ్గురు పాత్రలు ఎలా ముగుస్తాయి? అనే పాయింట్స్ తో భైరవం తెరకెక్కింది. శ్రీ చరణ్ పాకాల సంగీతాన్ని అందించాడు
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



