ఆంధ్రాకింగ్ తాలూకా విషయంలో పరిశ్రమ ఫెయిల్..భాగ్యశ్రీ బోర్సే ట్వీట్!
on Dec 2, 2025

-నిజంగానే భాగ్యశ్రీ బోర్సే ట్వీట్ చేసిందా!
-కలెక్షన్స్ ఎన్ని
-టాక్ బాగానే ఉంది
సిల్వర్ స్క్రీన్ పై ఎంతో ఎనర్జీతో పెర్ఫార్మ్ చేసే హీరోల్లో 'రామ్ పోతినేని'(Ram Pothineni)కూడా ఒకరు. గత నెల 27 న మాస్ అండ్ రొమాంటిక్ డ్రామా 'ఆంధ్ర కింగ్ తాలూకా'(Andhra king taluka)తో థియేటర్స్ లో ల్యాండ్ అయ్యాడు. ఉదయం 8 గంటల ఆట నుంచే పర్వాలేదనే టాక్ ని తెచ్చుకుంది. ఎక్కువ శాతం రివ్యూస్ కూడా పాజిటివ్ గానే వచ్చాయి. తాను అభిమానించే హీరో కోసం తనని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన అమ్మాయిని వదులుకోవడానికి సిద్దపడ్డ 'సాగర్' క్యారక్టర్ లో రామ్ నటన చాలా బాగుందని సినీ విశ్లేషకులు సైతం మెచ్చుకున్నారు. మహాలక్షి క్యారక్టర్ లో 'భాగ్యశ్రీ బోర్సే'(Bhagyashri Borse)తన అందంతో పాటు అంతకంటే అందమైన నటనతో కట్టిపడేసిందని కూడా ముక్తకంఠంతో చెప్పారు. కానీ కలెక్షన్స్ మాత్రం డల్ గా ఉన్నాయి. ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం ఇప్పటి వరకు 15 కోట్ల రూపాయల గ్రాస్ ని రాబట్టినట్టుగా తెలుస్తుంది.
ఈ నేపథ్యంలో 'ఆంధ్రా కింగ్ విషయంలో టాలీవుడ్ ఫెయిల్ అయింది' అని భాగ్యశ్రీ బోర్సే చేసిన ట్వీట్ ఇదేనంటూ సదరు ట్వీట్ ఇండస్ట్రీలో కాంట్రవర్శీగా మారడంతో పాటు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మూవీ బాగున్నా కలెక్షన్లు మాత్రం నిరాశపరుస్తుండటంతో ఆ పోస్ట్‌ను చాలామంది భాగ్యశ్రీ బోర్సే చేసిందని భావించారు. కానీ ఆ ట్వీట్ భాగ్యశ్రీ బోర్సే చెయ్యలేదు. ఆమె పేరుతో ఎవరో చేసారు. ఏది ఏమైనా ఆ ట్వీట్ తో సోషల్ మీడియా వేదికగా మూవీ లవర్స్ స్పందిస్తు బాగున్న సినిమాలని కూడా ఈ మధ్య కాలంలో చాలా మంది థియేటర్స్ కి వెళ్లి చూడటం లేదు.
also read: అప్పుడు మా అమ్మ, ఇప్పుడు ధర్మేంద్ర.. జాన్వీ కపూర్ కీలక వ్యాఖ్యలు
ఓటిటి లో చూసాక సినిమా చాలా బాగుంది కదా అని అనుకోవడం అలావాటు అయిపోయింది.అన్ని అంశాలు మిక్స్ అయి ఉన్న ఆంధ్ర కింగ్ తాలూకా ని థియేటర్ లో చూస్తూనే బాగుంటుందనే కామెంట్స్ చేస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ సుమారు 70 కోట్ల రూపాయలతో ఆంధ్ర కింగ్ తాలూకా ని నిర్మించగా మహేష్ బాబు పి(Mahesh Babu.P)దర్శకత్వం వహించాడు. సూర్య కుమార్ అనే సినిమా హీరో క్యారక్టర్ ల కన్నడ స్టార్ ఉపేంద్ర మెస్మరైజ్ చేసాడు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



