బ్యాట్‌పై గిటార్ వాయిస్తూ బాలకృష్ణ మాస్ విధ్వంసం!
on Jun 10, 2023
బాలకృష్ణ మూవీ అంటే ఆడియన్స్ లో ఎక్స్పెక్టేషన్స్ పీక్స్ లో ఉంటాయి. బాలయ్య చెప్పే డైలాగ్స్ కి ఎవ్వరికైనా సరే గూస్ బంప్స్ రావాల్సిందే. అలాంటి బాలయ్య పుట్టిన రోజు సందర్భంగా ఆయన నటించిన న్యూ మూవీ "భగవంత్ కేసరి" టీజర్ ఈ రోజు రిలీజ్ అయ్యింది. "రాజు ఆయన యెనక ఉన్న వందల మందిని చూయిస్తడు...మొండోడు ఆయనకున్న ఒకే ఒక గుండెను చూయిస్తడు" అంటూ మాస్ లుక్ లో బాలయ్య పవర్ ఫుల్ డైలాగ్ చెప్పారు. ఈ మూవీని దసరా కానుకగా రిలీజ్ చేయబోతున్నారు. సెంటిమెంట్ మూవీస్ లో బాలయ్య నటన అద్భుతం అనే విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ మూవీని తండ్రీ కూతుళ్ల సెంటిమెంట్‌తో తెరకెక్కించబోతున్నారు. "అడవి బిడ్డ నేలకొండ భగవంత్ కేసరి ఈ పేరు శానా ఏండ్లు యాదుంటది" అంటూ చెప్పే డైలాగ్ లో ఫైర్ కనిపించింది. ఈ టీజర్ చూస్తే చాలు బాలయ్య నుంచి ఎం కావాలని మాస్ అండ్ క్లాస్ ఆడియన్స్ కోరుకుంటారో ఆ ఎలిమెంట్స్ అన్నీ ఉండబోతున్నాయనే విషయం అర్ధమవుతోంది. బాలయ్యకు పోటీ వచ్చే విలన్ ని ఎంపిక చేయడం అంటే చాలా కష్టం...ఆయన లెవెల్ కి చేసే యాక్షన్ కి విలన్ రోల్ మరీ డమ్మీగా కాకుండా టూ ఎలివేట్ కాకుండా బాలన్స్ చేయడం కొంచెం కష్టమైన పనే...ఇక ఈ మూవీలో బాలయ్యతో ఢీ కొట్టడానికి విలన్ రోల్ లో అర్జున్ రాంపాల్ నటించారు. ఈ ఇద్దరి కాంబినేషన్ దసరాకి స్క్రీన్స్ మీద మ్యాజిక్ చేయబోతోంది.
ఇక బాలయ్యకు హీరోయిన్ రోల్ లో కాజల్ అగర్వాల్ కూతురిగా శ్రీలీల కనిపించబోతున్నారు. టీజర్ ఎండింగ్ లో వినిపించే సాంగ్ ఆడియన్స్ ని బ్లాక్ అండ్ వైట్ రోజుల్లోకి తీసుకెళ్లిపోతుంది. "జీవిత చక్రం" మూవీలో ఆ టైములో సూపర్ డూపర్ హిట్ ఐన సాంగ్ "కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడు...గుండెల్లో గుండె కలిపి చూడు" అనే సాంగ్ మ్యూజిక్ ని పెట్టారు. దానికి బాలయ్య ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ వేరే లెవెల్. ఫైర్, పెప్పర్, క్లాస్ మిక్స్ చేసి కొడితే ఒక స్పైసి లుక్ తో ఇంతకుముందెన్నడూ చూడని బాలయ్యను ఈ మూవీలో చూపించారు. అంతేకాదు ఈ మూవీలో బాలయ్య పాత్ర ఎంత పవర్ ఫుల్ గా ఉండబోతోందనే విషయం ఈ టీజర్ చూస్తేనే అర్థమైపోతుంది. ఇక సంగీతం గురించి చెప్పాలంటే థమన్.. ఆయన బీట్ బంపర్ హిట్ అనే విషయం అందరికీ తెలుసు. " పతా హై కానో కె బీచ్ మే భేజా క్యోన్ రెహతా హై... జబ్ కాన్ బైరి పే పడ్తీ హై .. తో బాత్ భేజే మే గుస్తీ హై అంటూ హిందీలో డైలాగ్ చెప్పారు బాలయ్య . చెవుల మధ్య మెదడు ఎందుకుంటుందో తెలుసా..చేత్తో కొడితే ఆ దెబ్బకు మైండ్ దిమ్మతిరిగే ఆ శబ్దం చెవుల్లోకి వస్తుంది" అనే అర్ధంలో ఈ డైలాగ్ ని మంచి ఫోర్స్ తో చెప్పారు. ఇక దసరాకి ఆ సౌండ్ తో స్క్రీన్స్ అన్నీ దద్దరిల్లబోతున్నాయి.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
