హిందీలో అనుష్క సినిమా రీమేక్
on Oct 23, 2019

'బాహుబలి' కాకుండా గత నాలుగైదు ఏళ్లలో అనుష్క నటించిన సినిమాల్లో గుర్తుపెట్టుకోదగ్గది, బాగా విజయవంతమైనది ఏదైనా ఉందంటే అది 'భాగమతి' చిత్రమే. అది ఫలానా జోనర్ సినిమా అని చెప్పలేం. హారర్, థ్రిల్లర్, క్రైమ్, కామెడీ... సినిమాలో అన్నీ ఉన్నాయి. ప్రతి పావుగంటకు, అరగంటకు జోనర్ మారుతుంది. ఈ కాన్సెప్ట్, స్టోరీ సెటప్ హిందీ ఇండస్ట్రీలో ఓ నటుడికి బాగా నచ్చింది. అతడు ఎవరనేది ఇంకా తెలియలేదు గాని, 'భాగమతి'ని హిందీలో రీమేక్ చేయడానికి చకచకా పావులు కదుపుతున్నాడని తెలిసింది. తెలుగు 'భాగమతి'కి దర్శకత్వం వహించిన అశోక్, హిందీ రీమేక్ కి దర్శకత్వం వహించనున్నారు.
'భాగమతి'గా అనుష్క నట విశ్వరూపం చూపించింది. 'ఎవడు పడితే వాడు రావడానికి ఎప్పుడు పడితే అప్పుడు పోవడానికి ఇదేమైనా పశువుల దొడ్డా... భాగమతి అడ్డా. భగ భగ భాగమతి' డైలాగ్స్ చెప్పే సన్నివేశంలో అయితే అనుష్కను తప్ప మరొకరిని ఊహించుకోలేం. తెలుగులో అనుష్క ఇమేజ్ కూడా ఈ చిత్రానికి కలిసి వచ్చింది. హిందీలో అనుష్క పాత్రను భూమి పెడ్నేకర్ చేయనున్నారు. మిగతా పాత్రలకు సెలక్షన్ జరుగుతోంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



