కాజల్ పెళ్లికి బెల్లంకొండ హీరో...
on Oct 22, 2020
అగ్ర కథానాయిక కాజల్ అగర్వాల్ పెళ్లికి తప్పకుండా వెళతానని యువ కథానాయకుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ చెబుతున్నాడు. ప్రస్తుతానికి... తెలుగు సినిమా ఇండస్ట్రీలో కాజల్ పెళ్లి ఆహ్వానం అతడికి మాత్రమే అందిందని అనుకోవచ్చు. కరోనా కారణంగా అందరికీ పెళ్లి పిలుపులు చెప్పడం లేదు. అతిథులు కేవలం 20మంది లోపే ఉండేలా కాజల్ ప్లాన్ చేసుకుంటోంది. అందులో బెల్లంకొండ ఉండటం విశేషమే.
బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కాజల్ అగర్వాల్ వరుసగా రెండు సినిమాలు 'సీత', 'కవచం' చేశారు. ఆ సమయంలో ఇద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది. అందువల్ల, అతడికి ఆహ్వానం అందింది. ఇక, పెళ్లి విషయానికి వస్తే... ఈ నెల 30న ముంబైలో జరగనుంది. మొదట ఫైవ్ స్టార్ హోటల్ లో అనుకున్నప్పటికీ తరవాత ఇంటిలో చేయాలని నిశ్చయించుకున్నారట. కాజల్ కి కాబోయే భర్త గౌతమ్ ఇంటీరియర్ డిజైనర్ అనే సంగతి తెలిసిందే.
Also Read