బెల్లంకొండకు హీరోయిన్ల సమస్య తీరింది కానీ...
on Oct 23, 2019

ఇక్కడ బెల్లంకొండ అంటే బెల్లంకొండ సాయిశ్రీనివాస్ కాదు. అతడి తమ్ముడు గణేష్. నిర్మాత బెల్లంకొండ సురేష్ రెండో కుమారుడు. పవన్ సాధినేని దర్శకత్వంలో హీరోగా పరిచయం కానున్నాడు. కథ ప్రకారం సినిమాలో ముగ్గురు హీరోయిన్లు. ముగ్గుర్నీ ఎంపిక చేసేశారు. బెల్లంకొండ గణేష్ కు జోడీగా 'మజిలీ'లో నాగచైతన్య కుమార్తెగా నటించిన అనన్య అగర్వాల్, 'హుషారు', తేజ దర్శకత్వంలో 'హోరాహోరీ'లో నటించిన దక్షా నాగర్కర్, నటాషా నటించనున్నారు. మొదట్లో కొంచెం క్రేజ్ ఉన్న కథానాయికలను తీసుకోవాలని ప్రయత్నించారు. కొత్త హీరో, హిట్ దర్శకుడు కాకపోవడంతో వాళ్ళందరూ ఆలోచించారు. ప్రస్తుతానికి బెల్లంకొండకు హీరోయిన్ల సమస్య తీరింది. కానీ, బెల్లంకొండ సాయిశ్రీనివాస్ మొదటి సినిమా 'అల్లుడు శీను'లో హీరోయిన్ గా నటించిన సమంత రేంజ్ వీళ్లకు లేదు. అందులో తమన్నా ఐటమ్ సాంగ్ చేసింది. ఇందులో ఎవరు చేస్తారో ఇంకా తెలియదు. కథపై నమ్మకంతో కొత్త హీరోయిన్లను తీసుకున్నారని అనుకున్నా... సినిమాకు ఈ ముగ్గురు హీరోయిన్లు ఏమాత్రం క్రేజ్ తీసుకొస్తారనేది చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



