బెల్లంకొండను చుట్టేశారు!
on Apr 21, 2015

గంగ సినిమా విడుదల మళ్లీ సంక్షోభంలో పడింది. ఈ సినిమా తమిళంలో ఆల్రెడీ విడుదలైపోయింది. అక్కడ హిట్ టాక్ వచ్చింది. తెలుగులోనూ వీలైనంత త్వరగా ఈ సినిమాని తీసుకురావాలని బెల్లంకొండ సురేష్ వీర ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే.. ఆయన చేసిన అప్పులు.. గంగ పాలిట శాపాలుగా మారాయి. రభస, అల్లుడు శీను సినిమాల సమయంలో ఆయన చేసిన అప్పులు, బయ్యర్లకు ఎగ్గొట్టిన బాకీలూ.. మెడకు చుట్టుకొన్నాయి. అవి తీరిస్తే గానీ.. గంగని విడుదల చేయనివ్వం అంటూ బాకీదార్లు బెల్లంకొండని చుట్టేశారు. గత నాలుగు రోజుల నుంచీ.. బెల్లంకొండ వాళ్లతో మంతనాలు జరుపుతున్నట్టు టాక్. అసలులో 40 శాతం ఇస్తా.. మిగిలింది తరవాత చూద్దాం.. అని బెల్లంకొండ చెబుతున్నా.. బాకీదార్లు పట్టువిడవడం లేదట. అసలు, వడ్డీ ఇప్పుడే చెల్లించాలి.. లేదంటే గంగ విడుదల కానివ్వం అంటూ భీష్మించుకొని కూర్చున్నారట. ఈరోజు ఎలాగైనా సరే... ఈ సమస్యకి పరిష్కారం దొరకాల్సిందే. లేదంటే.. గంగ సినిమా మరో వారం వాయిదా పడక తప్పదు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



