'దిల్' రాజు దగ్గరకు.. వయా బెక్కెం!
on Sep 7, 2019

యువ దర్శకులకు ఇది ఒక సదవకాశం.. మరీ ముఖ్యంగా దిల్ రాజు సంస్థలో సినిమా చేయాలనుకునే వాళ్లకు! బెక్కెం వేణుగోపాల్ నిర్మాణ సంస్థలో ఒక చిన్న సినిమా తీసి హిట్ కొడితే చాలు.. దిల్ రాజు దగ్గరకు వెళ్లడానికి రూట్ క్లియర్ అవుతుంది. అందుకు ఉదాహరణ.. 'హుషారు' ఫేమ్ శ్రీహర్ష కొనుగంటి. ఇప్పుడీ యువ దర్శకుడు దిల్ రాజు కాంపౌండ్‌లో ఉన్నాడు. మూడు నెలల నుండి స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నాడు. కథ ఒక కొలిక్కి వచ్చాక సినిమా ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. 'హుషారు' చిత్రానికి బెక్కెం వేణుగోపాల్ నిర్మాత. ఆయన ద్వారానే దిల్ రాజు దగ్గరకు శ్రీహర్ష వెళ్లాడు.
ఇతడి కంటే ముందు బెక్కెం వేణుగోపాల్ సంస్థలో హిట్ కొట్టి 'దిల్' రాజు దగ్గరకు వచ్చిన దర్శకుడు త్రినాథరావు నక్కిన. 'మేం వయసుకు వచ్చాం' చిత్రంతో ఇతణ్ణి వేణుగోపాల్ దర్శకుడిగా పరిచయం చేశారు. బయట నిర్మాతలకు త్రినాథరావు నక్కిన రెండు చిత్రాలు చేశాక.. మళ్లీ అతని దర్శకత్వంలో 'సినిమా చూపిస్త మావ' నిర్మించారు వేణుగోపాల్. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద కమర్షియల్‌గా సూపర్ సక్సెస్ సాధించింది. వెంటనే త్రినాథరావు నక్కినకు దిల్ రాజు సంస్థలో అవకాశం వచ్చింది. వరుసగా రెండు సినిమాలు 'నేను లోకల్', 'హలో గురు ప్రేమకోసమే' చేశాడు. బెక్కెం వేణుగోపాల్ సంస్థలో హిట్ కొట్టిన దర్శకుడు శ్రీహర్షకు ఇప్పుడు దిల్ రాజు అవకాశం ఇచ్చారు. ఈ లిస్టులో ఇంకెంత మంది దర్శకులు చేరతారో చూడాలి. అందులోనూ, ఇప్పుడు ఇతర నిర్మాతల భాగస్వామ్యంతో చిన్న చిత్రాలను నిర్మించాలని దిల్ రాజు చూస్తున్నారు. సో.. ఓత్సాహిక దర్శకులు ప్రయత్నాలు చేసుకోవచ్చు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



