అంబటి రాంబాబుని బండ్ల గణేష్ అంత మాట అన్నాడా!
on Sep 23, 2023
నటుడు, నిర్మాత బండ్ల గణేష్ తరచూ వార్తల్లో నిలుస్తుంటారు. ఇటీవల ఆయన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్ట్ కి వ్యతిరేకంగా తన గళం వినిపించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా ఏపీ మంత్రి అంబటి రాంబాబుపై ట్విట్టర్ లో బండ్ల గణేష్ పేరుతో ఓ షాకింగ్ కామెంట్ కనిపించింది. చాలామంది ఇది బండ్ల కామెంటే అనుకున్నారు. అయితే బండ్ల మాత్రం ఆ కామెంట్ తో తనకు ఎలాంటి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చారు.
"హలో.. లోకేష్ గారు!. తమరి లొకేషన్ ఎక్కడ?" అంటూ మాజీ మంత్రి నారా లోకేష్ ని టార్గెట్ చేస్తూ అంబటి రాంబాబు ట్వీట్ చేశారు. అయితే ఆ ట్వీట్ కి "ఏ వెళ్ళి కడుగుతావా" అంటూ బండ్ల గణేష్ పేరుతో దారుణమైన రిప్లై వచ్చింది. దీంతో ఒక్కసారిగా ఈ కామెంట్ వైరల్ గా మారింది. ఈ క్రమంలో బండ్ల స్పందించారు. "ఈ ట్వీట్ కి నాకు ఏమాత్రం సంబంధం లేదు. దయచేసి తప్పుడు ట్వీట్స్ నా పేరు మీద వేసి నన్ను ఇబ్బంది పెట్టవద్దు" అని బండ్ల ట్వీట్ చేశారు.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
