Home

»

Latest News

ప్ర‌భాస్ వ‌ర్సెస్ అక్ష‌య్ కుమార్!

Sep 27, 2021 5:40PM

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్, బాలీవుడ్ స్టార్ అక్ష‌య్ కుమార్.. హిందీనాట‌ ఒకే రోజు త‌మ చిత్రాల‌తో బాక్సాఫీస్ వార్ కి సిద్ధ‌మ‌వుతున్నారు. 2022 పంద్రాగ‌స్టు వారాంతం ఇందుకు వేదికగా నిల‌వ‌నుంది.

ఆ వివ‌రాల్లోకి వెళితే.. `తానాజీ` ఫేమ్ ఓమ్ రౌత్ ద‌ర్శ‌క‌త్వంలో ప్ర‌భాస్ న‌టిస్తున్న మైథ‌లాజిక‌ల్ మూవీ `ఆదిపురుష్`. రామాయణం ఆధారంగా రూపొందుతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో శ్రీ‌రాముడిగా ద‌ర్శ‌న‌మివ్వ‌నున్నారు ప్ర‌భాస్. సీత‌గా కృతి స‌న‌న్, రావ‌ణుడిగా సైఫ్ అలీ ఖాన్ న‌టిస్తున్న ఈ పాన్ - ఇండియా ప్రాజెక్ట్.. గ‌త ఏడాది ప్ర‌క‌టించిన‌ట్లే ఆగ‌స్టు 11న థియేట‌ర్స్ లో సంద‌డి చేయ‌నుంది. క‌ట్ చేస్తే.. అదే రోజున అక్ష‌య్ కుమార్ క‌థానాయ‌కుడిగా ఆనంద్ ఎల్. రాయ్ రూపొందిస్తున్న `రక్షా బంధ‌న్` చిత్రం కూడా విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. సిస్ట‌ర్ సెంటిమెంట్ ప్ర‌ధానంగా తెర‌కెక్కుతున్న ఈ సినిమాలో న‌లుగురు చెల్లెళ్ళ‌కు అన్న‌గా క‌నిపించ‌బోతున్నాడు అక్ష‌య్. కాగా ఈ సినిమాని ఆగ‌స్టు 11నే విడుద‌ల చేయ‌డానికి మ‌రో ముఖ్య కారణం.. టైటిల్ కి త‌గ్గ‌ట్టే ఆ రోజు ర‌క్షా బంధ‌న్ ప‌ర్వ‌దినం కావ‌డం.

మ‌రి.. ప్ర‌భాస్ వ‌ర్సెస్ అక్ష‌య్ కుమార్ అన్న‌ట్లుగా ఉన్న ఈ పంద్రాగ‌స్టు బాక్సాఫీస్ వార్ లో ఎవ‌రు విన్న‌ర్ గా నిలుస్తారో చూడాలి.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com