Home

»

Latest News

ఈడీ కార్యాలయానికి బండ్ల గణేష్.. నాకేం సంబంధం లేదంటూ స్టేట్మెంట్!

Aug 31, 2021 7:22PM

టాలీవుడ్ డ్ర‌గ్ కేసులో మ‌నీ లాండ‌రింగ్‌కు సంబంధించిన కోణంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్(ఈడీ) విచార‌ణ నేడు ప్రారంభమైన సంగతి తెలిసిందే. నేడు డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్‌ విచారణకు హాజరయ్యారు. ఈడీ అధికారులు పూరికి పలు ప్రశ్నలు సంధించినట్లు తెలుస్తోంది. ప్రధానంగా మనీ లాండరింగ్, ఫెమా ఉల్లంఘనలపై ఈడీ దర్యాప్తు కొనసాగుతోంది. ఇదిలా ఉంటే తాజాగా నిర్మాత బండ్ల గణేష్ ఈడీ కార్యాలయానికి వెళ్ళడం హాట్ టాపిక్ గా మారింది.

తాజాగా బండ్ల గణేష్ ఈడీ కార్యాలయానికి వచ్చారు. డ్రగ్స్ కేసు లిస్ట్ లో లేని బండ్ల ఒక్కసారిగా అక్కడ ప్రత్యక్షమయ్యే సరికి అంత షాక్ అయ్యారు. మరోవైపు బండ్ల డ్రగ్స్ కేసు విచారణకు హాజరైనట్లు సోషల్ మీడియాలో ప్రచారం మొదలైంది. దీంతో తాజాగా దీనిపై ట్విట్టర్ వేదికగా స్పందించిన బండ్ల.. తనకు ఏ విధమైన సంబంధం లేదని క్లారిటీ ఇచ్చారు. "దయచేసి నన్ను అర్థం చేసుకోండి. నాకు ఏ విధమైన సంబంధం లేదు. నేను పూరి గారికి మద్దతుగా మాత్రమే వచ్చాను" అంటూ ఆయన ట్వీట్ చేశారు.

కాగా పూరి-బండ్ల గతంలో ఇద్దరమ్మాయిలతో, టెంపర్ వంటి సినిమాలకు కలిసి పనిచేసిన సంగతి తెలిసిందే. ఆ బాండింగ్ తోనే విచారణకు హాజరైన పూరికి మద్దతుగా కార్యాలయానికి వచ్చారని తెలుస్తోంది.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com