బాలయ్య కుమార్తె పవర్ స్టార్ అభిమానా?
on Dec 31, 2022

సమయం, సందర్భం కలిసి వస్తే తప్ప పెద్ద పెద్ద సెలబ్రిటీలు తమకు ఏ హీరో అంటే ఇష్టం అనే విషయంలో నోరు మెదపరు. ఇటీవల చాలామంది హీరో హీరోయిన్లు తమకు పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టమని ఓపెన్‌గా చెబుతున్నారు. ఇక విషయానికి వస్తే.. తాజాగా నందమూరి నటసింహం బాలకృష్ణ అన్‌స్టాపబుల్ షోలో పవన్ కళ్యాణ్ పాల్గొన్న విషయం తెలిసిందే. ఈ షో షూటింగ్ కూడా పూర్తయింది. ఈ సీజన్ చివరి ఎపిసోడ్‌గా ఆహా వారు ఈ ఎపిసోడ్‌ను స్ట్రీమింగ్ చేసే అవకాశాలు ఉన్నాయి.
ఇక పవన్ పాల్గొన్న అన్‌స్టాపబుల్ షోకి సంబంధించిన పలు విషయాలు, ఫోటోలు, వీడియోలు, ప్రొమోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కొందరు ఆ ఫోటోలను, వీడియోలను బాగా షేర్ చేస్తున్నారు. అలా జరిగింది.. ఇలా జరిగింది.. అంటూ ఊహిస్తూ కథనాలు అల్లేస్తున్నారు. బాలయ్య చిన్న కూతురు తేజస్విని ఈ షోలో బాలయ్య స్టైలింగ్ విషయమై బాధ్యతలు నిర్వహిస్తోంది. ఈ షోకు మాత్రమే కాకుండా బాలయ్య నటించిన సినిమాలకు, ఇతర కార్యక్రమాలకు కూడా ఆమె కాస్ట్యూమ్స్ డిజైన్ చేస్తూ ఉంటుంది. దాంతో పవన్ గెస్టుగా వచ్చిన ఎపిసోడ్‌కు బాలయ్య కోసం తేజస్విని వచ్చిందని కొందరు, పవన్‌కి అభిమాని కావడం వల్ల ఆయనను కలిసి మాట్లాడేందుకు వచ్చిందని కొందరు.. సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు.
అసలు విషయం ఏంటంటే సీజన్ వన్ నుండి అన్‌స్టాపబుల్ షో కోసం తేజస్విని స్టైలింగ్ వ్యవహారాలను చూసుకుంటూ వస్తోంది. ఆమె ఆధ్వర్యంలో ఈమధ్యన బాలయ్య న్యూ లుక్ అభిమానులను బాగా అలరిస్తూ వస్తోంది. ప్రతి ఎపిసోడ్‌కి తేజస్విని కూడా హాజరవుతోంది. దాంతో తేజస్విని అన్‌స్టాపబుల్ సెట్ లో ఉంటున్నారు. కనుక ఆమె పవన్ ఎపిసోడ్‌కి ప్రత్యేకంగా వచ్చారు అనే వార్తల్లో నిజం లేదు. ఏమైనా ఈమె పవన్ కళ్యాణ్‌కు అభిమానా, కాదా.. అనేది కూడా తెలియాల్సి వుంది. దీనిపై మీడియాలో పలు రకాల కథనాలు వస్తున్నాయి. మరి వీటిల్లో ఏది నిజమనేది ఎపిసోడ్ స్ట్రీమింగ్ అయిన తర్వాత గాని తెలియదు...!
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



