Home

»

Latest News

డోంట్ ట్రబుల్ ది ట్రబుల్: 24 ఏళ్ళ తర్వాత వేరే హీరో సినిమాకి వాయిస్ ఓవర్ ఇచ్చిన బాలయ్య.!

Sep 22, 2026 7:36PM

నందమూరి బాలకృష్ణ.. ఈ పేరు వినగానే మనందరికీ ముందుగా గుర్తొచ్చేది ఆయన పవర్ ఫుల్ డైలాగ్ డెలివరీ. "కత్తులతో కాదురా.. కంటిచూపుతో చంపేస్తా", "చూడు ఒకవైపే చూడు.. రెండో వైపు చూడకు", "ఫ్లూటు జింక ముందు ఊదు... సింహం ముందు కాదు"... ఇలాంటి పవర్ ఫుల్ డైలాగ్స్ చెప్పడంలో బాలయ్యకు ఆయనే సాటి, ఆయనే పోటీ. అలాంటి బాలకృష్ణ ఇతర హీరోల సినిమాలకు వాయిస్ ఓవర్ అందిస్తే ఆ హైప్ వేరే లెవెల్ లో ఉంటుంది. కానీ, ఎందుకనో బాలయ్య అలా వాయిస్ ఓవర్ అందించిన సందర్భాలు మాత్రం చాలా తక్కువే. 

బాలకృష్ణ వాయిస్ ఓవర్ విషయానికొస్తే, మొట్టమొదటగా చెప్పుకోవాల్సింది 2002లో వచ్చిన 'యువరత్న' సినిమా గురించి. తారకరత్న హీరోగా నటించిన ఈ సినిమాకు బాలకృష్ణ వాయిస్ ఓవర్ అందించారు. నిజానికి ఇది తారకరత్న హీరోగా నటించిన మొదటి సినిమా అయినప్పటికీ, రెండో సినిమాగా విడుదలైంది. తన నందమూరి కుటుంబం నుంచి వచ్చిన యువ హీరోని ప్రోత్సహించడం కోసం.. అప్పుడు అన్నయ్య హరికృష్ణతో కలిసి బాలకృష్ణ వాయిస్ అందించారు. ఆ సినిమా హరికృష్ణ వాయిస్ ఓవర్ తో స్టార్ట్ అయ్యి, బాలయ్య వాయిస్ తో ఎండ్ అవుతుంది. 

ఇక ఇప్పుడు చాలా ఏళ్ళ తర్వాత మళ్ళీ బాలకృష్ణ ఒక సినిమా ట్రైలర్ కు వాయిస్ ఓవర్ అందించారు. అదే మలయాళ యాక్టర్ ఫహద్ ఫాజిల్ హీరోగా నటించిన 'డోంట్ ట్రబుల్ ది ట్రబుల్'. ఈ ట్రైలర్‌కు బాలయ్య వాయిస్ ఓవర్ అందించడం ఒక ఎత్తైతే.. అసలు ఆ సినిమా టైటిల్ రావడమే బాలయ్య ఐకానిక్ డైలాగ్ నుండి కావడం మరొక విశేషం. "డోంట్ ట్రబుల్ ది ట్రబుల్..." అంటూ బాలయ్య చెప్పిన మాస్ డైలాగ్ ఎంత వైరల్ అయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆర్కా మీడియా ప్రొడక్షన్, రాజమౌళి సమర్పణలో వస్తున్న ఈ ప్రాజెక్ట్‌కు బాలయ్య ఇచ్చిన వాయిస్ ఓవర్ ట్రైలర్‌కే ఓ రేంజ్ హైప్ తెచ్చిపెట్టింది. ఏది ఏమైనా తారకరత్న తర్వాత బాలకృష్ణతో వాయిస్ ఓవర్ చెప్పించుకున్న హీరోగా ఫహద్ ఫాజిల్ నిలిచాడు.

ఇది కూడా చదవండి:
సింహాద్రి 175 డేస్ రికార్డు.. ఎవరూ టచ్ చేయలేని రికార్డు సృష్టించిన ఎన్టీఆర్.!

మీకు నచ్చవచ్చు:
'ప్రాణం ఖరీదు' వెనుక ఉన్న సీక్రెట్స్.. చిరంజీవి ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా.?
తెలుగు సినిమాలో పౌరాణిక చిత్రాల ప్రయాణం.. ఎన్టీఆర్ నుంచి నేటి వారణాసి వరకు

 

 

 

[Balakrishna Voice Over Movies, NBK Voice Over Movies, Nandamuri Balakrishna, Dont Trouble The Trouble Trailer, Fahadh Fassil, SS Rajamouli, Taraka Ratna, Yuvarathna Movie, Telugu Film News, Telugu News]

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com