
విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో రూపొందుతోన్న ‘ఆదర్శ కుటుంబం – AK47’ సినిమా విడుదల తేదీ మారింది. తొలుత ప్రకటించిన తేదీ కంటే వారం ఆలస్యంగా, ఈ చిత్రాన్ని అక్టోబర్ 9న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు.
నిజానికి అక్టోబర్ 9 కి ‘ఆదర్శ కుటుంబం’ వాయిదా పడనుందంటూ ఇటీవల వార్తలొచ్చాయి. కానీ, మూవీ టీం మాత్రం ముందుగా ప్రకటించినట్టుగా అక్టోబర్ 2 నే వస్తామని చెప్పుకొచ్చింది. తీరా ఇప్పుడు రిలీజ్ డేట్ ఛేంజ్ చేస్తూ సర్ప్రైజ్ చేసింది.
ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. మధ్యతరగతి కుటుంబ నేపథ్యంలో వెంకటేష్ పాత్రను పరిచయం చేస్తూ.. కామెడీ, ఎమోషన్, యాక్షన్ అంశాలతో టీజర్ ఆకట్టుకుంది. ఈ నేపథ్యంలో సినిమాపై ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి నెలకొంది.
ఇది కూడా చదవండి: సింహాద్రి 175 డేస్ రికార్డు.. ఎవరూ టచ్ చేయలేని రికార్డు సృష్టించిన ఎన్టీఆర్.!
ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తుండగా.. నారా రోహిత్, నివేదా పేతురాజ్, రావు రమేష్, సత్య, బ్రహ్మాజీ, వెన్నెల కిశోర్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఎస్. రాధాకృష్ణ (చినబాబు) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.
.webp)
మీకు నచ్చవచ్చు:
'ప్రాణం ఖరీదు' వెనుక ఉన్న సీక్రెట్స్.. చిరంజీవి ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా.?
తెలుగు సినిమాలో పౌరాణిక చిత్రాల ప్రయాణం.. ఎన్టీఆర్ నుంచి నేటి వారణాసి వరకు
[Aadarsha Kutumbam On October 9th, Aadarsha Kutumbam Release Date Changed, Aadarsha Kutumbam Postponed, Aadarsha Kutumbam October 9 Release, Victory Venkatesh, Trivikram Srinivas, Telugu Film News, Telugu News]





