
నేచురల్ స్టార్ నాని రేంజ్ ఏంటో 'ది ప్యారడైజ్' ద్వారా స్పష్టంగా కనపడుతుంది. రిలీజ్ రేపే అయినా సినీ ప్రేమికుల్లో, అభిమానుల్లో వారం నుంచే అడ్వాన్స్ బుకింగ్స్ లో జోష్ కనపడటమే అందుకు ఉదాహరణ. ఇక ఈ రోజు రాత్రి తెలంగాణ వ్యాప్తంగా భారీ ఎత్తున ప్రీమియర్ షోలని మేకర్స్ ప్లాన్ చేశారు.
దీంతో హైదరాబాద్‌లో సినీ అభిమానుల నిలయంగా భావించే ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని ఒక థియేటర్‌కు వెళ్లి ప్రీమియర్ షో చూడాలని నాని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్ థియేటర్‌లో సినిమా చూడటానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ హీరో నాని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మరియు తెలంగాణ పోలీస్ ఉన్నతాధికారులను ట్యాగ్ చేస్తూ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఒక భావోద్వేగమైన బహిరంగ విజ్ఞప్తి చేశారు. "చిన్నప్పటి నుంచే సినిమాను ఎంతో ప్రేమించే ఒక సాధారణ అభిమానిగా, సినిమాని ప్రేక్షకుల మధ్య కూర్చొని ఆస్వాదించడంలోనే నాకు అసలైన సంతోషం ఉంటుంది. ముఖ్యంగా హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్‌రోడ్స్ థియేటర్ల వాతావరణం నాకు చాలా ప్రత్యేకమైనది.
ఇది కూడా చదవండి: హీరోకి ఎంత కష్టమొచ్చింది: అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాడా!

ఎంతో శ్రమించి రూపొందించిన 'ది పారడైజ్' చిత్రాన్ని తాము ఎవరి కోసం తీశామో, ఆ ప్రేక్షకుల మధ్య కూర్చొని వారి ప్రత్యక్ష స్పందనలు, విజిల్స్, చప్పట్లు అనుభవించడంలోనే ఒక నటుడిగా తనకు పూర్తీ సంతృప్తి లభిస్తుంది. గతంలో ఇటువంటి భారీ ప్రీమియర్ ప్రదర్శనల సమయంలో జరిగిన ఘోర ఘటనలని దృష్టిలో ఉంచుకుని, భద్రతకే తమ తొలి ప్రాధాన్యత. ప్రభుత్వ భద్రతా మార్గదర్శకాలు, పోలీస్ ప్రోటోకాల్స్ అన్నింటినీ తమ బృందం 100% కచ్చితంగా పాటిస్తుందని, ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసుకుంటామని ఎక్స్ వేదికగా పేర్కొన్నాడు. మరి తెలంగాణ ప్రభుత్వం ఎలా స్పందిస్తో చూడాలి.
[Nani, The Paradise, Revanth Reddy, Srikanth Odela, Telugu Cinema, Telugu Cinema News, Tollywood, Tollywood News]






