శాతకర్ణి కోసం ఎక్సర్ సైజ్ చేస్తున్న బాలయ్య..!
on Apr 28, 2016
.jpg)
నందమూరి నటసింహం వందో సినిమా శాతకర్ణిని చాలా ప్రేస్టేజియస్ గా తీసుకున్నారు. పూర్తిగా శాతకర్ణి చరిత్రలో మునిగిపోయారు బాలయ్య. క్రిష్ కథ చెప్పిన విధానం కూడా ఆయన్ను కట్టిపడేసిందని సమాచారం. అంతలా నచ్చింది కనుకే, బోయపాటి, కృష్ణవంశీ లాంటి దర్శకుల్ని పక్కన పెట్టి ఈ కథకు తలూపారు. ఇక సినిమా కోసం తనను తాను మార్చుకునే పనిలో కూడా బాలకృష్ణ చాలా బిజీగా ఉన్నారు. ఒక చక్రవర్తి ఎలా ఉంటాడో అలాంటి రాజసంతో సినిమాలో కనిపించాలనేది బాలయ్య ఆలోచన. దీని కోసం బరువు తగ్గించుకోవడంతో పాటు, ఉదయం సాయంత్రం వేళల్లో పూర్తి సమయాన్ని జిమ్ కే కేటాయిస్తున్నారట బాలయ్య. కార్డియో, వెయిట్స్ తో పాటు, యోగాను కూడా అభ్యసిస్తున్నారట. గతంలో భైరవద్వీపం లాంటి సినిమాల్లో ఆయన గుర్రపు స్వారీ చేసినా, యుద్ధ సన్నివేశాల్లో గుర్రాన్ని కంట్రోల్ చేయడం చాలా కష్టమవుతుంది కాబట్టి, పూర్తి స్థాయి గుర్రపు స్వారీ నేర్చుకుంటున్నారు. కత్తి తిప్పడం లాంటివాటికి మాత్రం ప్రత్యేకమైన ట్రైనింగ్ అవసరంలేదని బాలయ్య చెప్పినట్టు సమాచారం. తెలుగు వారి గొప్పదనాన్ని చాటే చిత్రం అని మొదటినుంచీ చెప్తూ వస్తుండటంతో, ఆ మాటను నిలబెట్టుకోవడంలో ఎక్కడా తేడా రాకూడదని బాలయ్య క్రిష్ కు స్పష్టం చేశారట. ఇక ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తుండగా, బాలయ్య సరసన అనుష్కను హీరోయిన్ గా ఎంపిక చేసినట్టు సమాచారం. బాలయ్య తల్లి పాత్రకు బాలీవుడ్ డ్రీమ్ గర్ల్ హేమమాలినిని తీసుకోవడం విశేషం.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



