నా మాటలు నొప్పిస్తే మన్నించండి అంటున్న బాలయ్య
on Mar 8, 2016
.jpg)
నారా రోహిత్ సావిత్రి ఆడియో ఫంక్షన్లో బాలకృష్ణ మాట్లాడిన మాటలు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. " మా ఫ్యాన్స్ హీరోయిన్ల వెనకాల పడితే ఒప్పుకోరు. ముద్దైనా పెట్టాలి, కడుపైనా చేయాలి " అంటూ బాలయ్య సరదాగా వ్యాఖ్యానించారు. కానీ ఈ మాటలు వివాదాలకు దారి తీశాయి. బాలకృష్ణ మహిళలను కించపరిచారంటూ, చాలా మంది పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం వరకూ వెళ్లారు. తన వ్యాఖ్యలు దుమారం రేపుతుండటం, పైపెచ్చు ఈ రోజు మహిళా దినోత్సవం కావడంతో బాలకృష్ణ ఈ విషయంపై స్పందించారు.
తన వ్యాఖ్యలు సరదాగా అన్నవే కానీ, ఎవరినీ కించపరచాలనే ఉద్దేశం తనకు లేదని ఆయన చెప్పారు. " మహిళలంటే నాకు గౌరవం. నా సినిమాల్లో కూడా మహిళల గౌరవానికే పెద్దపీట ఉంటుంది. స్త్రీలను తోబుట్టువులుగా, మా ఆడపడుచులుగా చూడటం మాకు అలవాటు. నా సినిమాల గురించి చెబుతూ చేసిన ఆ వ్యాఖ్యలు ఎవరినీ ఉద్దేశించనవి కాదు. ఒక వేళ అలా ఎవరైనా నొచ్చుకుని ఉన్నట్లైతే, క్షమాపణ కోరుతున్నాను " అంటూ బాలయ్య మన్నింపు కోరారు. ఇదే విషయంపై అసెంబ్లీలో కూడా ఆయన ప్రస్తావించడం విశేషం.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



