Home

»

Latest News

అంత సీన్ లేదు: ఫేక్ రికార్డులపై నాగవంశీ షాకింగ్ కామెంట్స్.!

Oct 5, 2026 4:20PM

విక్టరీ వెంకటేశ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో వస్తున్న ‘ఆదర్శ కుటుంబం’ సినిమా అక్టోబర్ 9న విడుదల కావాల్సి ఉండగా వాయిదా పడింది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్ మీట్ లో.. ఈ మూవీ ఫస్ట్ సింగిల్ ‘నారాయణమ్మ’ పాటపై నాగవంశీ ఆసక్తికర కామెంట్స్ చేశారు.

సాంగ్స్‌కు మిలియన్ల కొద్దీ వ్యూస్ రావడం, వాటిలో కొంత భాగం పెయిడ్ వ్యూస్ అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ రావడం ఈ మధ్య సాధారణంగా మారిపోయింది. ఇదే క్రమంలో ‘నారాయణమ్మ’ పాటకు వచ్చిన 10 మిలియన్ వ్యూస్‌పై నాగవంశీ తనదైన శైలిలో స్పందించారు. ఈ పాటకు వచ్చిన వ్యూస్ కోసం తాము ఎలాంటి డబ్బులు ఖర్చు చేయలేదని ఆయన స్పష్టం చేశారు.

“ఈ పాటకు ఆన్‌లైన్‌లో విపరీతమైన ఆదరణ దక్కి ఇప్పటికే 10 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. కానీ నేనేమీ డబ్బులు ఖర్చుపెట్టి ఆ వ్యూస్‌ను కొనలేదు. ప్రస్తుతం ఒక సాంగ్‌కు డబ్బులు పోసి వ్యూస్ కొనేంత శక్తి, సీన్ నా దగ్గర లేవు. ప్రేక్షకులు మనస్ఫూర్తిగా చూసి ఎంజాయ్ చేయడం వల్లే ఆ నంబర్స్ వచ్చాయి తప్ప ఇందులో ఎలాంటి ఫేక్ వ్యవహారాలు లేవు” అని నాగవంశీ తేల్చిచెప్పారు.

అంతేకాదు.. ‘నారాయణమ్మ’ పాట విషయంలో మరో చర్చపైనా నాగవంశీ క్లారిటీ ఇచ్చారు. ఇది పాత రేలంగి పాటకు రీమిక్స్ కాదని చెప్పారు. ఆ పాటను నేటి తరం అభిరుచికి తగ్గట్టుగా ఫ్రెష్‌గా ప్రెజెంట్ చేశామని తెలిపారు. పాత పాటను కొత్త తరానికి కనెక్ట్ అయ్యేలా అందించడమే తమ ఉద్దేశమని ఆయన వివరించారు.

మరోవైపు ‘ఆదర్శ కుటుంబం’ రిలీజ్ విషయంలో కూడా నాగవంశీ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. సోషల్ మీడియాలో వచ్చే ట్రోల్స్, నెగెటివిటీని దృష్టిలో పెట్టుకునే సినిమా విషయంలో టైం తీసుకుంటున్నామని ఆయన చెప్పారు. హడావుడిగా రిలీజ్ చేసి 80 శాతం అవుట్‌పుట్ ఇవ్వడం కంటే.. కాస్త ఆలస్యమైనా 100 శాతం క్వాలిటీతో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడమే తమ ఉద్దేశమని నాగవంశీ స్పష్టం చేశారు.

ఇది కూడా చదవండి: బాంబు పేల్చిన నాగవంశీ.. ‘ఆదర్శ కుటుంబం’ వాయిదాకు అసలు కారణమిదే.!

 

 

 

[Producer Naga Vamsi On Paid Views, Aadarsha Kutumbam postponed, Narayanamma Song, Naga Vamsi Press Meet, Aadarsha Kutumbam Movie, Producer Naga Vamsi, Victory Venkatesh, Trivikram Srinivas, Telugu Film News]

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com