
గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ 'దాదా' తర్వాత చేయబోయే మూవీ కొరటాల శివతో అని అనౌన్స్ మెంట్ రావడంతో ఫ్యాన్స్ ఆనందం అంతా ఇంతా కాదు. కమర్షియల్ టచ్ కి సోషల్ మెసేజ్ ని నింపడంలో కొరటాల సిద్ధహస్తుడు కావడంతో స్టోరీతో పాటు బాలకృష్ణ క్యారక్టర్ పై ఫ్యాన్స్ తో పాటు మూవీ లవర్స్ పలురకాల కథల్ని ఊహించుకోవడం స్టార్ట్ చేసారు.
అంతేకాకుండా, ఈ చిత్రానికి సౌత్ రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నట్లు వార్తలు రావడంతో అంచనాలు స్థాయి కూడా పెరిగింది. అయితే, గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా వేదికగా ఈ సినిమా ఆగిపోయిందంటూ అనేక రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. సుమారు రూ. 150 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించడానికి ప్రణాళికలు సిద్ధం చేయగా, బాలకృష్ణ గారు ఇటీవల బడ్జెట్ మరియు కమర్షియల్ సేఫ్టీ విషయాల్లో మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారనే ప్రచారం మొదలైంది. రూ. 100 కోట్ల పరిధిలోనే ప్రాజెక్టులు పూర్తి చేయాలని ఆలోచిస్తున్నారని, అందుకే రూ. 150 కోట్ల బడ్జెట్ హర్డిల్ కారణంగా కొరటాల శివ సినిమాపై అనిశ్చితి ఏర్పడిందని వార్తలు వ్యాపించాయి. ఈ పుకార్లతో నందమూరి అభిమానులు తీవ్ర ఆందోళనకు గురై, సినిమా అప్‌డేట్ వెంటనే ఇవ్వాలని నెట్టింట డిమాండ్ చేయడం ప్రారంభించారు.

Also Read: జై జై రామ్ సాంగ్: ఎందుకిలా చేసారు? ఉన్న అర్హత ఏంటి!
అయితే అదే సమయంలో బాలయ్య డై హార్డ్ ఫాన్స్ కూడా సోషల్ మీడియా వేదికగా స్పందిస్తు' అనవసరమైన రూమర్లని నమ్మవద్దని, త్వరలోనే అధికారిక ఫస్ట్ లుక్ లేదా టైటిల్ అనౌన్స్‌మెంట్ అప్‌డేట్ రాబోతోందని సమాచారం.ఏది ఏమైనా బాక్స్ ఆఫీస్ కూడా కొత్తగా బరిలోకి దిగబోతున్న ఒంగోలు గిత్తలా బాలయ్య, కొరటాల మూవీ కోసం కాసుకొని కూర్చుంటుందనేది పక్కా.
[Balakrishna, Koratala Siva, , NBK112 , Fans Demand, Telugu Cinema, Telugu Cinema News, Tollywood Cinema News, Tollywood]






