
భవ్య శ్రీ మూవీ మేకర్స్, నక్కిన నెరేటివ్స్ బ్యానర్ల మీద కాండ్రేగుల నాయుడు, త్రినాథరావు నక్కిన నటిస్తూ, నిర్మించిన రా అండ్ రస్టిక్ చిత్రం ‘అనకాపల్లి’. ఈ మూవీలో విక్రమ్ సహిదేవ్, సంధ్యా వశిష్ట, తారక్ పొన్నప్ప ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాకి ఖగేష్ తమ్మినేని దర్శకత్వం వహించారు. ఇప్పటికే విడుదల చేసిన పాటలు, టీజర్, ట్రైలర్‌లు సినిమాపై అంచనాల్ని పెంచేశాయి. ఇక ఆగస్ట్ నెలలోనే ఈ మూవీని అనకాపల్లి ప్రజలకు ప్రత్యేకంగా ప్రదర్శించారు.
‘అనకాపల్లి’ సినిమాని అనకాపల్లి ప్రజలు వీక్షించి అద్భుతమైన రెస్సాన్స్‌ను అందించారు. ఈ మూవీని తెలుగులో పాటుగా తమిళంలోనూ భారీ ఎత్తున విడుదల చేసేందుకు మేకర్స్ రెడీ అయ్యారు. అక్టోబర్ 2న ఈ చిత్రాన్ని విడుదల చేయబోతోన్నట్టుగా మేకర్స్ ప్రకటించారు. ఈ మేరకు విడుదల చేసిన రిలీజ్ డేట్ పోస్టర్ అందరినీ ఆకట్టుకుంటోంది. ప్రధాన పాత్రల్ని చూపిస్తూ వినాయక చవితి సందర్భంగా రిలీజ్ చేసిన ఈ పోస్టర్ ఇప్పుడు అందరిలోనూ మరింత ఇంట్రెస్ట్‌ను క్రియేట్ చేస్తోంది.
మైత్రి మూవీ డిస్ట్రిబ్యూషన్, పూర్వి డిస్ట్రిబ్యూషన్స్ సంస్థలు కలిసి ఈ సినిమాని అక్టోబర్ 2న గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతోన్నాయి. ఈ చిత్రానికి మాయా.వి కెమెరామెన్‌గా, శ్రీకృష్ణ అత్తలూరి ఎడిటర్‌గా పని చేశారు. త్రినాథరావు నక్కిన కథ, స్క్రీన్ ప్లే అందించిన ఈ చిత్రానికి ఉదయ్ భాగవతులు డైలాగ్ రైటర్‌గా వర్క్ చేశారు.

[Anakapalli Release Date, Anakapalli on October 2, Anakapalli Movie Telugu, Trinadha Rao Nakkina, Vikram Sahidev, Telugu Film News, Telugu News]





