బాహుబలికి బ్రేక్ అయిపోయింది..!
on May 24, 2016

బాహుబలి సినిమాకు సమ్మర్ బ్రేక్ ముగిసింది. వేసవి తాపంలో షూటింగ్ చేయలేక నెలరోజుల పాటు సెలవు ప్రకటించిన జక్కన్న, తిరిగి షూటింగ్ మొదలెట్టేశాడు. ప్రస్తుతం క్లైమాక్స్ షూట్ చేస్తున్న మూవీ టీం సినిమాను కంప్లీట్ చేయడంలో బిజీ అయిపోయారు. ఇన్నాళ్లూ తమకు లభించిన బ్రేక్ లో దాదాపు సినిమాలో కీలక పాత్రధారులందరూ ఫారిన్ చెక్కేసి రిలాక్స్ అయ్యారు. రీసెంట్ గానే ప్రభాస్, అనుష్క షూటింగ్ లో జాయిన్ అవ్వగా, త్వరలోనే రానా కూడా వీళ్లతో కలుస్తాడని తెలుస్తోంది. 2017 ఏప్రిల్ 14 న సినిమాను రిలీజ్ చేస్తామని రాజమౌళి ప్రకటించిన సంగతి తెలిసిందే. షూటింగ్ ఇంకో నెల రోజుల్లో పూర్తైపోయినా, ఆ తర్వాతి నుంచీ గ్రాఫిక్స్ కోసమే చాలా టైం పడుతుందని, అందుకే జక్కన్న రిలీజ్ డేట్ ను అంత ముందుకు జరిపాడని అంటున్నారు. అన్నింటి కంటే ముఖ్యంగా, మొదటి పార్ట్ మీద వచ్చిన హైప్ కు తగ్గకుండా రెండో భాగాన్ని తెరకెక్కించడమే ఇప్పుడు రాజమౌళి ముందున్న పెద్ద బాధ్యత. సెకండ్ పార్ట్ అంతా ఫ్లాష్ బ్యాక్ కథతో నడుస్తుందని సమాచారం.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



