' బాహుబలి 'కి జాతీయ అవార్డు అందుకునే అర్హత లేదు..!
on Mar 31, 2016

జాతీయ ఉత్తమ చిత్రంగా 63వ జాతీయ అవార్డుల్లో బాహుబలి ఎంపికైంది. తెలుగువారందరికీ గర్వకారణంగా నిలిచిన బాహుబలికి ఆ ప్రతిష్టాత్మక అవార్డు రావడం పట్ల తెలుగుజాతి అంతా గర్వించింది. కానీ బయటి రాష్ట్రాల వాళ్లకు, చాలా మంది బాలీవుడ్ వాళ్లకు కూడా బాహుబలికి జాతీయ అవార్డు రావడం నచ్చలేదు. కేవలం ఒక పార్ట్ మాత్రమే రిలీజైన సినిమాకు నేషనల్ అవార్డ్ ఎలా ఇస్తారు అని, గ్రాఫిక్స్ తప్ప సినిమాలో ఏముంది అని రకరకాలుగా విమర్శిస్తున్నారు. పంజాబీ డైరెక్టర్ గుర్వీందర్ సింగ్ అయితే ఒకడుగు ముందుకు వేసి, జాతీయ ఉత్తమ చిత్రంగా ఎంపికైన వరస్ట్ ఫిల్మ్ బాహుబలి అనేశాడు. జాతీయ అవార్డులు ఎంపిక పట్ల చాలామంది డిజప్పాయింట్ అయ్యారని, అవార్డుల ఎంపిక సక్రమంగా లేదని మండిపడుతున్నాడు. గుర్వీందర్ సినిమా చౌతీ కూట్ రీజినల్ బెస్ట్ ఫిల్మ్ ఫర్ పంజాబీగా ఎంపికైనా, గుర్వీందర్ కు తృప్తి లేదు. మరోవైపు బాహుబలి నిర్మాతల టీం, తమను ఎంతగానో ఆదరించిన అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ ప్రెస్ నోట్ విడుదల చేయడం కొసమెరుపు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



